జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఈ సీజన్‌లో ఆరు విజయాలకే పరిమితమైన ఆర్సీబీ ఇంటిదారి పట్టింది. రాజస్తాన్ రాయల్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో కోహ్లి అండ్ గ్యాంగ్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆర్సీబీ ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్(53), పార్థీవ్ పటేల్(33)లు మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 19.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. కోహ్లి(4), మొయిన్ అలీ(1), మన్‌దీప్ సింగ్(3), గ్రాండ్ హోమ్(2), సర్ఫరాజ్ ఖాన్(7)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు.
దాంతో ఎటువంటి సమీకరణాలు లేకుండానే ఆర్సీబీ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా, అదే సమయంలో విజయం సాధించిన రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ నాలుగు వికెట్లతో ఆర్సీబీ నడ్డివిరవగా, బెన్ లాఫిన్ రెండు వికెట్లు, గౌతమ్, ఉనాద్కత్, ఇష్ సోథీలు తలో వికెట్ తీశారు. ఈ సీజన్‌లో మొత్తం లీగ్ మ్యాచ్‌ల్ని ఆడేసిన రాజస్తాన్ రాయల్స్ 14 పాయింట్లతో ఉంది. మిగతా మ్యాచ్‌ల్లో ఫలితాలపై రాజస్తాన్ రాయల్స్ భవితవ్యం ఆధారపడి వుంది. ప్రస్తుతం మరో రెండు ప్లే ఆఫ్ స్థానాల కోసం ముంబై ఇండియన్స్, కింగ్స్ పంజాబ్, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది.
ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(80 నాటౌట్; 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరవగా, అజింక్యా రహానే(33), క్లాసెన్(32)లు ఫర్వాలేదనిపించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను త్రిపాఠి, జోఫ్రా ఆర‍్చర్‌లు ఆరంభించారు. కాగా, ఆర‍్చర్ డకౌట్‌గా నిష్క్రమించడంతో రాజస్తాన్ రెండు పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో త్రిపాఠితో జత కలిసిన రహానే ఇన‍్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించిన తర్వాత రహానే పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రహానే ఔటయ్యాడు. ఆపై మరుసటి బంతికే సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సంజూ శాంసన్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో త్రిపాఠి-క్లాసెన్‌లు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకున్నారు. ఈ జోడి 48 పరుగులు జత చేసిన తర్వాత క్లాసెన్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివరి ఓవర్‌లో కృష్ణప‍్ప గౌతమ్(14 నాటౌట్; 5 బంతుల్లో 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ రాయల్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment