ఆ విషయంలో మా అంచనా తప్పింది: కోహ్లి | Virat Kohli Says Read The Chinnaswamy Stadium Pitch Wrong | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 16 2018 3:57 PM | Last Updated on Mon, Apr 16 2018 3:57 PM

Virat Kohli Says Read The Chinnaswamy Stadium Pitch Wrong - Sakshi

విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌

బెంగళూరు : చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌ను తప్పుగా అంచనా వేయడంతో రాజస్థాన్‌రాయల్స్‌పై ఓటమి చవిచూసామని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ సొంతమైదానంలోనే ఆర్సీబీని చిత్తు చేసింది. టాస్‌ గెలిచిన కోహ్లి పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని ఫీల్డింగ్‌ వైపు మొగ్గుచూపాడు. కానీ బంతి సులువుగా బ్యాట్‌పైకి వెళ్లడంతో రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ సంజూశాంసన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆర్సీబీకి రాజస్తాన్‌ 217 పరుగుల భారీ లక్ష్యాన్నినిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యచేధనలో ఆర్సీబీ బ్యాట్స్‌మన్‌ తడబడటంతో రాజస్తాన్‌ సులువుగా విజయాన్నందుకుంది. ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. పిచ్‌ను చాలా నెమ్మదిగా ఉంటుందని భావించా. కానీ రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో మేం ఆశ్చర్యపోయేలా బంతి నేరుగా బ్యాట్‌పైకి వెళ్లింది. రెండు వందల పరుగలు చేసే వికెట్‌ అని ఊహించలేదు. కానీ జరిగింది. టీ20లో ఇది సహజమేనని పేర్కొన్నాడు. 

47 పరుగులిచ్చిన బౌలర్‌ క్రిస్‌వోక్స్‌ను కోహ్లి సమర్థించాడు.. ‘ప్రతిసారి క్రిస్‌వోక్స్‌ సరిగ్గా బౌలింగ్‌ చేయలేనేది ఏం లేదు. అతన్ని వేలంలో అధిక ధర వెచ్చించి తీసుకున్నందుకు వికెట్లు తీయాలి. ఇక ఉమేశ్‌ యాదవ్‌(4 ఓవర్లకు 59) దారళంగా పరుగిలివ్వడం, ఈ వికెట్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 400 పరుగులు నమోదు కావడంతో ఇది మా రోజు కాదు. ఈ మ్యాచ్‌ విషయంలో బౌలర్లు తమని తాము నిందించుకోవాల్సిన అవసరం లేదని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్‌ పిచ్‌పై 200 పరుగుల టార్గెట్‌ నమోదవుతుందని అనుకోలేదని ఈనేపథ్యంలోనే టాస్‌ గెలిచినా ఫీల్డింగ్‌వైపు మొగ్గ చూపినట్లు పేర్కొన్నాడు. ఇక చివర్లో మన్‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ పోరాటాన్ని కోహ్లి కొనియాడాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అద్బుతంగా పోరాడారని, ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ విఫలమైన జట్టుపై నమ్మకం ఉంచేలా ఆడారని ప్రశంసించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement