ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. విరాట్ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడాడు.
Virat Kohli talking to Anushka Sharma and Vamika after won the match.
— CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024
- CUTEST VIDEO OF THE DAY. ❤️ pic.twitter.com/srREuiqS8u
కోహ్లి తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో సందడి చేస్తుంది. కోహ్లి ఇటీవలే రెండో బిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. కోహ్లి భార్య అనుష్క ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. కోహ్లి దంపతులు ఆ పిల్లాడికి అకాయ్ అని నామకరణం చేశాడు. కోహ్లి దంపతులకు ఇదివరకే ఓ అమ్మాయి ఉంది. ఆమె పేరు వామిక.
THE VINTAGE KING KOHLI...!!!!! 🐐
— CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024
One of the Greatest Post Match Interview by any Cricketer in the History - King Kohli You're the GOAT. pic.twitter.com/cZ331UXGlI
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం ప్రజెంటేటర్ హర్షా భోగ్లేతో కోహ్లి మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం వైరలవుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో తన వ్యక్తిగత అనుభవాల (లండన్) గురించి హర్షా కోహ్లిని అడుగగా.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
రెండో సారి తండ్రైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది తనకు తన కుటుంబానికి మరపురాని అనుభూతి. కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేసే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. తమను గుర్తు పట్టని ప్రదేశంలో సాధారణ జీవనం గడిపే అవకాశం దొరికింది. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలని కోహ్లి తెలిపాడు.
క్రికెట్‌కు సంబంధించి కోహ్లి మాట్లాడుతూ.. అంతిమంగా గణాంకాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకుంటారు. రాహుల్ ద్రవిడ్ చెప్పేది ఇదే. ఆర్సీబీ అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ, ప్రశంసలు, మద్దతు అద్భుతమైనవి. ఇవి నేనెప్పటికీ మరచిపోలేనని కోహ్లి అన్నాడు.
ఇదే సందర్భంగా కోహ్లి మరిన్ని ఆసక్తికర అంశాల గురించి కూడా ప్రస్తావించాడు. విశ్వవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ ప్రమోషన్ కోసం తన పేరు ఉపయోగపడుతుందని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది ఇంకా రెండో మ్యాచ్ మాత్రమే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని ఆర్సీబీ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. హర్షా భోగ్లే విరాట్‌కు ఆరెంజ్ క్యాప్ అందజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment