# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు! | WPL 2024 RCB Fans Rejoice Memes Mandhana Team Finally Ends Trophy Drought | Sakshi
Sakshi News home page

# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!

Published Mon, Mar 18 2024 10:40 AM | Last Updated on Mon, Mar 18 2024 12:00 PM

WPL 2024 RCB Fans Rejoice Memes Mandhana Team Finally Ends Trophy Drought - Sakshi

WPL 2024 విజేత ఆర్సీబీ (PC: RCB X)

ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది.

వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్‌ సాలా కప్‌ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్‌.. ‘‘ఇస్‌ సాలా కప్‌ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్‌ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన.

ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్‌ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సహా గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తిక్‌ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్‌ చేసింది.

మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్‌ ఫస్ట్‌’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్‌ టీమ్‌’’ అంటూ ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్‌ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్‌ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!!

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్‌గా అవతరించింది.

చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement