
సాక్షి, హైదరాబాద్ : ఇటలీలో రహస్యంగా పెళ్లి చేసుకోని ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మలపై అటు అభిమానులు.. ఇటు ప్రముఖుల అభినందనల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికా క్రికెటర్, కోహ్లి ఐపీఎల్ టీమ్‌మెట్ ఏబీ డివిలియర్స్ లేట్‌గా చెప్పిన లేటెస్ట్‌గా అన్నట్లు ఓ వీడియోతో విరుష్కకు శుభాకాంక్షలు తెలిపాడు. తన వ్యక్తిగత అఫిషియల్ యాప్‌లో డివిలియర్స్ ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘పెళ్లితో ఒక్కటైన విరుష్కకు అభినందనలు. మీ పెళ్లి నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. మీ ఇద్దరు సుఖవంతమైన జీవితం గడపుతారని నాకు తెలుసు. మీ జీవితంలోకి చాలా మంది పిల్లలు రావాలని ఆశిస్తున్నా.’ అని డివిలియర్స్ తెలిపారు.
కోహ్లి, డివిలియర్స్ ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా ఈ ఇద్దరు మంచి స్నేహితులు కూడా. పలు సందర్భాల్లో వీరి స్నేహాన్ని బాహటంగానే ప్రదర్శించారు. గత ఐపీఎల్ సీజన్‌లో కాస్త సమయం దొరికినా విరాట్ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీలు ఈ ఇద్దరు సందర్శించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment