
ఎట్టకేలకు విరాట్ కోహ్లి-అనుష్క శర్మ మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఊహాగానాలు, వదంతులకు చెక్‌పెడుతూ ఈ ప్రేమజంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇటలీ టస్కనీ పట్టణంలో అత్యంత సన్నిహితుల నడుమ కన్నులపండువగా వీరి పెళ్లి జరిగింది. ప్రేమానుబంధానికి సరికొత్త నిర్వచనంగా నిలిచిన ఈ జంటకు సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విరుష్క జంట పెళ్లి నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి తర్వాత విరాట్-అనుష్క ఎక్కడ ఉండబోతున్నారు? విరాట్ సొంతూరు ఢిల్లీ. మరి సొంతూరులోనే ఈ దంపతులు కాపురం పెట్టబోతున్నారా? అంటే అదేమీ లేదని తాజాగా వీరి అధికారి ప్రతినిధి వెల్లడించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అనుష్క శర్మ బిజీగా ఉంది. ఆమె కెరీర్‌కు ఆటంకం కలుగకుండా కొత్త జంట ముంబై వర్లీలో కాపురం పెట్టబోతోంది. వర్లీలో తీసుకున్న కొత్త నివాసంలో వీరి కలిసి నివసించబోతున్నారు. అంటే అనుష్క కోసం విరాటే మకాం మారుస్తున్నాడన్నమాట.
ఇక పెళ్లయిన తర్వాత కూడా అనుష్క సినిమా కెరీర్‌ను కొనసాగించబోతోంది. ఇప్పటికే ఖరారైన ’సూయ్ ధాగా’ సినిమాలో వరుణ్ ధావన్‌కు జోడీగా నటించబోతుంది. అలాగే తన తాజా సినిమా పారి ప్రమోషన్‌లో పాల్గొనబోతుంది. ఈలోపు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న టీమిండియీ దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లితోపాటు అనుష్క కూడా వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment