
ఈ ఏడాది మ్యారేజ్ ఆఫ్ ది ఇయర్ విరాట్ కోహ్లి-అనుష్క శర్మలదే కానుంది. వీరి పెళ్లి దాదాపు కన్ఫర్మ్ అయింది. ఇటలీలో అంగరంగ వైభవంగా వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. దక్షిణ ఇటలీలోని టుస్కానీ నగరంలో ఒక రిసార్ట్‌లో ఘనంగా వీరి వివాహం జరగనుంది. స్థానికంగా వారసత్వ కట్టడంగా పేరొందిన చారిత్రక ప్రదేశం బోర్గో ఫినోచీటోలో వీరు వచ్చే మంగళవారం వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. జాతీయ మీడియా సైతం వీరి పెళ్లి వార్తలను ధ్రువీకరిస్తూ కథనాలు ప్రచురించింది. అధికారిక ధ్రువీకరణ మాత్రం రావాల్సి ఉంది.
ఇప్పటికే వీరి పెళ్లి వేదిక అయిన రిసార్ట్ చుట్టూ పెద్ద ఎత్తున భద్రతా వలయాన్ని ఏర్పాటుచేసి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆహ్వాన పత్రిక ఉంటేనే అతిథులను ఈ ప్రాంతంలోకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. పంజాబీ తరహాలో పెళ్లి జరగనున్నట్టు ఏర్పాట్లను బట్టి తెలుస్తోంది. భాంగ్రా నృత్యకారులు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించే కళాకారులు ఇప్పటికే రిసార్ట్‌కు చేరుకున్నారు.
రిసార్ట్‌లో మధ్యాహ్నం పెళ్లి, సాయంత్రం విందు (పార్టీ) ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక భారత్‌లోనూ విరాట్-అనుష్క జంట గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీని ఇవ్వబోతోంది. శ్రీలంక పర్యటనలో చివరి ట్వంటీ 20 మ్యాచ్ ముగిసిన రెండు రోజుల తరువాత, ఈ నెల 26న ముంబైలో కోహ్లి గొప్ప రిసెప్షన్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బిసిసిఐ అధికారులు, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు అనేక మందిని రిసెప్షన్‌కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

చారిత్రక ప్రదేశం బోర్గో ఫినోచీటో..
Comments
Please login to add a commentAdd a comment