
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా ఫీల్డ్‌లో ఉండాల్సిన క్రికెటర్లు ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నారు. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్‌లో పాల్గొంటూ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న బెంగను తీర్చుకుంటున్నారు. తమ గత మధుర జ‍్క్షాపకాలను, చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ సరదా సరదాగా గడిపేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సభ్యులైన విరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్‌లు ఇలానే ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ముచ్చటించుకున్నారు. 2011 ఐపీఎల్‌నుంచి ఒకే జట్టులో సభ్యులుగా ఉన్న విరాట్, డివిలియర్స్ పలు ఆసక్తికర అంశాలు చర్చించుకున్నారు. (ఆ విధ్వంసక జెర్సీలు వేలానికి..)
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ చాటింగ్‌ను అనుసరించారు. తొలిసారి ఆర్‌సీబీ జట్టుతో చేరినప్పుడు ఇన్నేళ్లు వారితో ఉంటాననే నమ్మ కం తనకు కనిపించలేదని ఏబీ గుర్తు చేసుకోగా... తాను ఎప్పటికీ బెంగళూరు టీమ్‌ను వీడను, మరో జట్టుకు ఆడనని కోహ్లి స్పష్టం చేశాడు. ఇక ఐపీఎల్–2016లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీలు చేసిన బ్యాట్లను, జెర్సీలను వేలానికి ఉంచుతున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని కోవిడ్–19 సేవా కార్యక్రమాలకు అందించడానికి సిద్ధమయ్యారు.(ధోని ఇక ‘మెన్ ఇన్ బ్లూ’లో కనిపించడు..)
ఈ సుదీర్ఘ లైవ్ సెషన్‌లో కోహ్లి చుట్టపక్కల ఏమి జరుగుతుందని విషయాన్ని కూడా మర్చిపోయాడు. చీకటిగా ఉన్న రూమ్‌లో కూర్చొనే డివిలియర్స్‌తో మాట్లాడేస్తున్నాడు. అయితే ఆ గది చీకటిగా ఉందనే విషయాన్ని గమనించిన కోహ్లి భార్య అనుష్క శర్మ వచ్చి లైట్లు వేసింది. దాంతో ఒక్కసారిగా తేరుకున్న కోహ్లి.. పెదవులపై చిరునవ్వులు చిందిస్తూ ‘థాంక్స్ మై లవ్’ అని చెబుతాడు. దీనిని ఒక అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment