గ్రేనేడ్తో వివాహ వేడుకపై దాడి | Four killed in Afghan grenade attack | Sakshi
Sakshi News home page

గ్రేనేడ్తో వివాహ వేడుకపై దాడి

Published Sun, Dec 7 2014 2:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

Four killed in Afghan grenade attack

కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ బాల్క్ ప్రావెన్స్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. చమ్మథాల్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహ వేడుకపైకి ఆగంతకుడు గ్రేనేడ్ విసిరాడు. ఆ గ్రేనెడ్ పేలుడులో నలుగురు మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఆ దాడికి తామే బాధ్యులమని ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement