ఒంగోలు: పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ నల్లమల్ల అటవీ ప్రాంతంలో బోల్తా పడి ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గిద్దలూరులోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పెళ్లి బృందంలోని సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి బృందం గిద్దలూరు నుంచి మహానంది వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సానూభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం - కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని మహానంది మండలం చింతమాని మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
పెళ్లి బృందం లారీ బోల్తా : ఆరుగురు మృతి
Published Sat, Dec 20 2014 9:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement