వేలంపాటపై డీఎస్పీ విచారణ
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: దుమాలలో ఎంపీటీసీ సభ్యుడి ఏకగ్రీవం కోసం జరిగిన వేలంపాటపై సోమవారం పోలీసులు విచారణ జరిపారు. సర్పంచ్‌తో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సరిగ్గా నామినేషన్ల తొలిరోజే పోలీసులు పార్టీల నాయకులకు గట్టి షాక్ ఇచ్చారు. దుమాలతో పాటు సిరిసిల్ల పట్టణంలో పుస్తెమెట్టెలు పంపిణీ చేసిన సంఘటనపై మరో కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ దామెర నర్సయ్య తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేయడం కోసం సొంత డబ్బుతో రోడ్డు వేయిస్తామని ఉల్లి కిష్టయ్య, ఉల్లి బాలయ్య ముందుకు రాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆదివారం రాత్రి, సోమవారం గ్రామంలో రెండు దఫాలుగా బహిరంగ విచారణ జరిపారు. డీఎస్పీ స్వయంగా వెళ్లి వేలం ఘటనపై ఆరా తీశారు.
ఓటర్లు మనోభావాలను వ్యక్తం చేయకుండా అడ్డుకోవ డంలో భాగంగానే సమావేశం ఏర్పాటుచే సి ఏకగ్రీవ ప్రయత్నాలు చేశారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి తహశీల్దార్ అమర్‌నాథ్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ నర్సింహరెడ్డితో పాటు ఉల్లికిష్టయ్య, ఉల్లి బాలయ్యపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం మాడల్‌టీంను ఏర్పాటు చేశామన్నారు.
డివిజన్ పరిధిలో డబ్బులు, మద్యం, సామగ్రి సరఫరా జరుగకుండా ఆరు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ రంగయ్యగౌడ్ , ఎస్సై రమేశ్‌కుమార్, ఏఎస్సైలు మురళీధర్ రావు, రవీందర్ ఉన్నారు.