
తీర్మాన పత్రాలను హరీశ్‌కు ఇస్తున్న దృశ్యం
సాక్షి, సిద్దిపేట: ‘మన గ్రామాలను మనమే బాగు చేసుకోవాలి. అందుకు గ్రామస్తుల మధ్య ఐక్యత అవసరం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో హరీశ్ సమీక్ష నిర్వహించారు. ఒక గ్రామంలో ఒకే వినాయకుడిని పెట్టాలన్న హరీశ్ పిలుపు మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని 34 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఆయా గ్రామాల నేతలు తీర్మాన పత్రాలను హరీశ్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలను హరీశ్ అభినందించారు. ఒక గ్రామంలో ఒకే వినాయకుడిని పెట్టడం మూలంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసిన వారవుతారన్నారు. ప్రభు త్వం నుంచి వచ్చే నిధులే కాకుండా గ్రామ యువత, మహిళా సంఘాలతోపాటు అందరూ కలసి శ్రమదానం చేసి గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మానసిక ప్రశాంతతకు గ్రామాల్లో యోగ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెంచాలని.. ప్రతీ గ్రామంలో మహిళా గ్రామ సభలు నిర్వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment