హైదరాబాద్ : నార్త్‌జోన్ పరిధిలో చైన్‌స్నాచర్లు గురువారం మరోసారి రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్‌స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బుధవారం జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటన మరవకముందే గురువారం ఉదయం తుకారాం పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో చైన్‌స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది.
అడ్డగుట్టలోని కిరాణా షాపులో సరుకులు ఇస్తున్న లక్ష్మి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు తెంచుకుని వెళ్లారు. బాధితురాలు తుకారాం గేట్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు మహిళ మెడలో ఉన్నది నకిలీ బంగారం గొలుసు అని లక్ష్మి పోలీసులకు వెల్లడించింది.