హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు మంగళవారం రెచ్చిపోయారు. కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్నగర్ ప్రాంతాల్లోని మహిళలే లక్ష్యంగా చేసుకుని... తమ ప్రతాపాన్ని చూపించారు. కేపీహెచ్బీ వివేకానందనగర్లోని మహిళ నుంచి మూడు తులాల బంగారం గొలుసును దుండగులు లాక్కెళ్లారు. అలాగే ఎస్ఆర్ నగర్లోని మహిళ నుంచి చైన్ లాక్కెళ్లారు.