విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో ఇటీవల చైన్ స్నాచింగ్లు కేసుల భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు.