
చైన్ స్నాచర్లు అరెస్ట్: 28 తులాల బంగారం స్వాధీనం
ప్రకాశం జిల్లా సంతమాగలూరులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో వారి వద్ద నుంచి 28 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు స్టేషన్కు తరలించి.... పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో గతంలో వారు చోరి చేసిన వివరాలు పూసగుచ్చినట్లు వెల్లడించారు. పట్టబడిన చైన్ స్నాచర్లపై గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 11 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.