santhamaguluru
-
జగనన్నను గెలిపించుకోడానికి మేమున్నాం.. చంద్రబాబు పెద్ద..!
-
జెండా స్తంభానికి కరెంట్; ముగ్గురు చిన్నారుల మృతి
సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు గాయపడ్డారు.ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామంలోని జెండా స్తంభాన్ని పట్టుకుని ఆడుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతి చెందిన విద్యార్థులు షేక్ పఠాన్ గౌస్, షేక్ హసన్ బుడే , పఠాన్ అమర్ ఐదో తరగతి చదువుతున్నట్టు తెలిసింది. ముగ్గురూ పదకొండేళ్ల వయసు వారేనని కుటుంబ సభ్యులు తెలిపారు. -
కాలినడకన భద్రాచలం
వత్సవాయి: ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన వైఎస్ జగన్ అభిమానులు భద్రాచలంకు పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం కృష్ణాజిల్లా మక్కపేటకు చేరుకున్న వీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం కొనసాగించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తాము పాదయాత్ర చేస్తున్నట్లు సంతమాగులూరుకు చెందిన రైతులు కొండారెడ్డి దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి శ్రీరామ్‌రెడ్డి. జెట్టిబోయిన చంద్రశేఖర్, కణుదుల పుల్లారెడ్డి, కడెం శ్రీనులు చెప్పారు. సంతమాగులూరు నుండి భద్రాచలం 300 కి.మీ. ఉన్నట్లు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న వీరికి స్థానిక నాయకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. -
పేలిన సిలిండర్: లక్షన్నర ఆస్తి నష్టం
ప్రకాశం (సంతమాగులూరు) : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామంలోని దొండపాటి కోటేశ్వరరావు ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటనలో డబ్బుతోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. గ్యాస్ లీకవుతుండటం గమనించి ఇంట్లో వాళ్లు బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. -
జవ్వాది అరెస్ట్ దుర్మార్గం : వైవీ సుబ్బారెడ్డి
-
జవ్వాది అరెస్ట్ దుర్మార్గం : వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం జడ్పీటీసీ సభ్యుడు జవ్వాది రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. రంగారెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఒంగోలులో మాట్లాడుతూ... జడ్పీ ఎన్నికల్లో జిల్లా పోలీసుల ఓవరాక్షన్‌పై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో రంగారెడ్డిని ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రకాశం జడ్పీ ఎన్నికను వాయిదా వేయాలని ప్రభుత్వానికి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
పోలీసుల ఓవరాక్షన్: వైఎస్ఆర్ జడ్పీటీసీ అరెస్ట్
ప్రకాశం జిల్లాలో పోలీసులు ఆదివారం ఓవరాక్షన్ చేశారు. మార్కాపురం వైఎస్ఆర్ పార్టీకి చెందిన జడ్పీటీసీ జవ్వాది రంగారెడ్డిని డీఎస్పీ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు బస్సులో వెళ్తున్న ప్రకాశం జిల్లా జడ్పీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న బస్సును సంతమాగులూరు వద్ద అడ్డుకుని జవ్వాదిని అరెస్ట్ చేశారు. జవ్వాది అరెస్ట్‌ను తోటి జడ్పీటీసీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే డీఎస్పీ అధ్వర్యంలో పోలీసులు జడ్పీటీసీలను బెదిరించారు. దాంతో వారు మిన్నకుండిపోయారు. జవ్వాదిపై గతంలో ఎస్టీ మహిళను దూషించారని... ఈ నేపథ్యంలో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అందువల్లే జవ్వాదిని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
పోలీసుల ఓవరాక్షన్: వైసీపీ జడ్పీటీసీ అరెస్ట్
-
చైన్ స్నాచర్లు అరెస్ట్: 28 తులాల బంగారం స్వాధీనం
ప్రకాశం జిల్లా సంతమాగలూరులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో వారి వద్ద నుంచి 28 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించి.... పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో గతంలో వారు చోరి చేసిన వివరాలు పూసగుచ్చినట్లు వెల్లడించారు. పట్టబడిన చైన్ స్నాచర్లపై గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 11 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.