జవ్వాది అరెస్ట్ దుర్మార్గం : వైవీ సుబ్బారెడ్డి | YV Subba reddy takes on prakasam district police | Sakshi
Sakshi News home page

జవ్వాది అరెస్ట్ దుర్మార్గం : వైవీ సుబ్బారెడ్డి

Published Sun, Jul 13 2014 9:06 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

YV Subba reddy takes on prakasam district police

ప్రకాశం జిల్లా మార్కాపురం జడ్పీటీసీ సభ్యుడు జవ్వాది రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. రంగారెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఒంగోలులో మాట్లాడుతూ... జడ్పీ ఎన్నికల్లో జిల్లా పోలీసుల ఓవరాక్షన్పై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో రంగారెడ్డిని ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రకాశం జడ్పీ ఎన్నికను వాయిదా వేయాలని ప్రభుత్వానికి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement