పోలీసుల ఓవరాక్షన్: వైఎస్ఆర్ జడ్పీటీసీ అరెస్ట్ | YSR ZPTC member arrested by prakasam district police at Santhamaguluru | Sakshi
Sakshi News home page

పోలీసుల ఓవరాక్షన్: వైఎస్ఆర్ జడ్పీటీసీ అరెస్ట్

Published Sun, Jul 13 2014 8:48 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

పోలీసుల ఓవరాక్షన్: వైఎస్ఆర్ జడ్పీటీసీ అరెస్ట్ - Sakshi

పోలీసుల ఓవరాక్షన్: వైఎస్ఆర్ జడ్పీటీసీ అరెస్ట్

ప్రకాశం జిల్లాలో పోలీసులు ఆదివారం ఓవరాక్షన్ చేశారు. మార్కాపురం వైఎస్ఆర్ పార్టీకి చెందిన జడ్పీటీసీ జవ్వాది రంగారెడ్డిని డీఎస్పీ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు బస్సులో వెళ్తున్న ప్రకాశం జిల్లా జడ్పీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న బస్సును సంతమాగులూరు వద్ద అడ్డుకుని జవ్వాదిని అరెస్ట్ చేశారు. జవ్వాది అరెస్ట్ను తోటి జడ్పీటీసీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

 

అయితే డీఎస్పీ అధ్వర్యంలో పోలీసులు జడ్పీటీసీలను బెదిరించారు. దాంతో వారు మిన్నకుండిపోయారు. జవ్వాదిపై గతంలో ఎస్టీ మహిళను దూషించారని... ఈ నేపథ్యంలో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అందువల్లే జవ్వాదిని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement