వత్సవాయి: ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన వైఎస్ జగన్ అభిమానులు భద్రాచలంకు పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం కృష్ణాజిల్లా మక్కపేటకు చేరుకున్న వీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం కొనసాగించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తాము పాదయాత్ర చేస్తున్నట్లు సంతమాగులూరుకు చెందిన రైతులు కొండారెడ్డి దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి శ్రీరామ్‌రెడ్డి. జెట్టిబోయిన చంద్రశేఖర్, కణుదుల పుల్లారెడ్డి, కడెం శ్రీనులు చెప్పారు. సంతమాగులూరు నుండి భద్రాచలం 300 కి.మీ. ఉన్నట్లు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న వీరికి స్థానిక నాయకులు అల్పాహారం ఏర్పాటు చేశారు.