
సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు గాయపడ్డారు.ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామంలోని జెండా స్తంభాన్ని పట్టుకుని ఆడుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతి చెందిన విద్యార్థులు షేక్ పఠాన్ గౌస్, షేక్ హసన్ బుడే , పఠాన్ అమర్ ఐదో తరగతి చదువుతున్నట్టు తెలిసింది. ముగ్గురూ పదకొండేళ్ల వయసు వారేనని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment