పాతబస్తీలో ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు బుధవారం పట్టుకున్నారు.
పాతబస్తీలో ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 40 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం పాతబస్తీలో ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బైకును కూడా పోలీసుస్టేషన్కు తరలించి సీజ్ చేసిన సంగతి తెలిసిందే.