హైదరాబాద్ : హైదరాబాద్లోని కంచన్బాగ్ పరిధిలో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడిచి వెళ్తున్న మహిళపై దాడి చేసి... ఆమె మెడలో బంగారం గొలుసును తెంచుకుని... బైక్పై పరారైయ్యారు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలని సమీపంలోని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.