విజయవాడ : కృష్ణాజిల్లా అవనిగడ్డలో పోలీసులు శుక్రవారం ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 105 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. చైన్ స్నాచర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా విచారణ నిమిత్తం పోలీసులు చైన్ స్నాచర్లను తమదైన శైలిలో విచారిస్తున్నారు. అవనిగడ్డలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దీంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శుక్రవారం పోలీసులు తనిఖీల్లో సదరు చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు.