కరీంనగర్‌లో గొలుసు దొంగతనాలు; 8తులాల బంగారం చోరీ | 8 grams gold stolen at Karimnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో గొలుసు దొంగతనాలు; 8తులాల బంగారం చోరీ

Published Sat, Jan 24 2015 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

8 grams gold stolen at Karimnagar district

కరీంనగర్ క్రైం: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఎనిమిది తులాల బంగారం చోరీ చేశారు. నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన చవోటి విజయవర్షిణి శనివారం ఉదయం పాలు తీసుకురావడాని సమీపంలోని కిరాణ దుకాణం వద్దకు వెళ్లి పాలు తీసుకుని వస్తుండగా వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 3 తులాల పుస్తెలతాడు తెంచుకుని పారిపోయాడు. ద్యానగర్‌కు చెందిన పెండ్యాల విద్యాగౌతమి(34) శనివారం మధ్యాహ్నం మిత్రురాలితో కలిసి చైతన్యపురికాలనీలోని మహాశక్తి ఆలయానికి వెళ్లింది.తిరిగి వస్తుండగా ఆలయం సమీపంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అమె మెడలోని 5 తులాల పుస్తెలతాడు, నల్లపూసల దండ తెంపుకుని పారిపోయారు.

దొంగల కోసం ప్రత్యేక బృందాలు...సీఐ హరిప్రసాద్
నగరంలో శనివారం జరిగిన చోరీల నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశామని టుటౌన్ సీఐ హరిప్రసాద్ తెలిపారు. కొందరు అనుమానితుల సమాచారం తెలిసిందని త్వరలోనే వారిని పట్టుకుంటామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement