
చైన్‌స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయం?
వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. సైబరాబాద్ పోలీసులు ఈ నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులలో ఒకరికి బుల్లెట్ గాయం అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆటోనగర్ నుంచి చింతల్‌కుంట, సాగర్ రింగ్ రోడ్డు, కర్మన్‌ఘాట్ మీదుగా కంచన్‌బాగ్ వైపు వాళ్లు పరారైనట్లు సమాచారం సేకరించారు. దీంతో ఆ మార్గంలో ఉన్న అన్ని ఆస్పత్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎక్కడైనా ఆస్పత్రులలో వాళ్లు చికిత్స పొందుతూ ఉండొచ్చన్న అనుమానంతో అన్నిచోట్లా గాలిస్తున్నారు.