bullet injury
-
తుపాకీ పేలి.. గోవిందా కాలికి గాయం
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా(60) కాలికి బుల్లెట్ గాయమైంది. ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతుండగా ఉదయం 4.45 గంటల సమయంలో చేతిలో ఉన్న లైసెన్సుడ్ రివాల్వర్ అనుకోకుండా పేలిందని పోలీసులు తెలిపారు. ‘వైద్యులు గోవిందా కాలిలోని బుల్లెట్‌ను తొలగించారు. ఎడమ మోకాలి దిగువన 8–10 కుట్లు పడ్డాయి. ఆయన కోలుకుంటున్నారు’అని పోలీసులు తెలిపారు.ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టామన్నారు. ‘అభిమానులు, తల్లిదండ్రులు, ఆ దేవుని ఆశీర్వాదంతో గాయం నుంచి కోలుకుంటున్నాను. నాకు తగిలిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించారు’అంటూ గోవిందా ఒక ఆడియో సందేశం విడుదల చేశారు.మంగళవారం కోల్‌కతాలో జరిగే ఓ షోలో గోవిందా పాల్గొనాల్సి ఉందని ఆయన మేనేజర్ శశి సిన్హా తెలిపారు. రివాల్వర్‌ను కప్‌బోర్డులో ఉంచే సమయంలో పొరపాటున ట్రిగ్గర్‌పై వేలు పడి, పేలి కాలికి తగిలిందని సిన్హా వివరించారు. రివాల్వర్‌ను చెక్ చేస్తుండగా చేతుల్లో జారి అనుకోకుండా పేలిందని గోవిందా సోదరుడు కృతి కుమార్ చెప్పారు. -
బొమ్మ తుపాకీ అనుకుంటే.. గుండెను చీల్చేసింది
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యతో యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆయనతో అనుబంధం ఉన్న ప్రపంచ నేతలు షాక్‌కు గురయ్యారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నరా నగరంలో శుక్రవారం ఈ ఘాతుకం జరిగింది. ఆదివారం జపాన్ పార్లమెంటు ఎగువ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో షింజో అబే మాట్లాడుతుండగా, వెనుకగా వచ్చిన దుండగుడు దేశవాళీ తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాగా, షింజే అబేపై కాల్పులు జరగడం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తపు మడుగులో కుప్పకూలిన అబేను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దుండగుడు తొలిసారి కాల్చినప్పుడు అందరూ బొమ్మ తుపాకీ కాల్పులు అనుకున్నారట ప్రత్యక్ష సాక్షులు. అప్పటికి షింజో అబే కిందపడిపోలేదని, కానీ రెండో రౌండ్ కాల్చాక ఆయన నేలకొరిగారని ఓ యువతి ఘటన గురించి వివరించింది. రెండో రౌండ్ కాల్చడం స్పష్టంగా కనిపించిందని, తుపాకీ నుంచి నిప్పులు రావడంతోపాటు, పొగ కూడా వెలువడిందని, దాంతో అవి నిజం కాల్పులేనని అర్థమయ్యాయని ఆమె వెల్లడించింది. కిందపడిపోయిన షింజే అబే అచేతనంగా కనిపించడంతో, పలువురు ఆయన ఛాతీపై మర్దన చేశారు. కాగా, ఓ బుల్లెట్ షింజో అబే గుండెను నేరుగా తాకిందని, దాంతో ఆయన గుండె ఛిద్రమైందని చికిత్స అందించిన డాక్టర్లు వెల్లడించారు. గుండె భాగంలో పెద్ద రంధ్రం పడిందని వివరించారు. ఆయన మరణానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఓ బుల్లెట్ గుండెను తాకగా, మరో బుల్లెట్ ఆ గాయాన్ని మరింత క్లిష్టతరం చేసిందని వివరించారు. షింజో అబేను అసుపత్రికి తీసుకువచ్చేసరికి ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురైన స్థితిలో ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఐదు గంటల పాటు తీవ్రంగా శ్రమించామని వివరించారు. రక్తం కూడా ఎక్కించామని తెలిపారు. ఏదీ ఫలితాన్నివ్వలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. టెత్సుయా యమగామి(41).. జపాన్ సైన్యంలో పని చేసిన వ్యక్తి. తనకు నచ్చని సంస్థతో షింజో అబే సంబంధాలు కలిగి ఉన్నాడని, ఆయన తీరుపై అసంతృప్తితోనే కాల్చేశానని, రాజకీయ సిద్ధాంతాల పరంగా ఆయనతో ఎలాంటి విబేధాలు లేవని టెత్సుయా యమగామి పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. #ShinzoAbe Closest vid for now pic.twitter.com/RZGAFjqDMY — DanJuan (@DanJuan18) July 8, 2022 -
వీడేం తండ్రి.. మూడేళ్లకు విషాదంగా ముగిసిన చిన్నారి కథ!
తన వ్యసనం కోసం కొడుకు ప్రాణాలనే అడ్డు పెట్టిన ఓ మూర్ఖుడి కథ ఇది. తనకేమైనా హాని జరుగుతుందన్న ఉద్దేశంతో.. దూసుకొచ్చిన ప్రమాదం ముందర చంటి బిడ్డను ఉంచాడు. ఫలితం.. ఆ పసికందు శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి!. ఫిలడెల్ఫియాలో సుమారు రెండేళ్ల కిందట సంచలనం సృష్టించిన కేసు.. ఇప్పుడు విషాదంగా ముగిసింది. ఫిలడెల్ఫియా హంటింగ్ పార్క్ సెక్షన్‌కు చెందిన నఫెస్ మోన్రోయ్.. తన దగ్గరున్న నకిలీ కరెన్సీతో డ్రగ్స్ కొనే ప్రయత్నం చేశాడు. అయితే ఈ వ్యవహారం బెడిసికొడితే తనకేమైనా హాని కలుగుతుందన్న ఉద్దేశంతో.. కూడా తన 11 నెలల బాబు యసీమ్ జెన్కిన్స్ను రక్షణ కవచంగా వెంటపెట్టుకెళ్లాడు. నఫెస్ ఊహించినట్లుగానే.. డ్రగ్ డీలర్ ఫ్రాన్సిస్కో ఒర్టిజ్, నఫెస్పై కాల్పులకు దిగాడు. ఆ టైంలో యసీమ్ను అడ్డు పెట్టడంతో ఆ పసికందు శరీరంలోకి బుల్లెట్లు దిగాయి. తల, మెడ, వెనుక భాగంలోకి మూడు బుల్లెట్లు దిగగా.. వైద్యులు తీవ్రంగా శ్రమించి ప్రాణాపాయ స్థితి నుంచి ఆ చిన్నారిని బయటపడేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది అప్పట్లో. ఇక మూర్ఖంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నఫెస్ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసు విచారణ సమయంలో.. యసీమ్ జెన్కిన్స్ను ‘మానవ కవచం’గా అభివర్ణించారు జడ్జిలు. అప్పటి నుంచి ఆ చిన్నారి తల్లి సంరక్షణలో ఉంటూ వస్తున్నాడు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ఆ గాయాల తాలుకా ప్రభావంతో ఆ చిన్నారి మరణించినట్లు తెలుస్తోంది. శుక్రవారం మూడేళ్ల యసీమ్ జెన్కిన్స్ కన్నుమూసినట్లు ఫిలడెల్ఫియా అధికారులు ప్రకటించారు. ఇది అప్పటి గాయాల ప్రభావంతోనేనా? అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. ఇక కాల్పులు జరిపిన ఫ్రాన్సిస్కోను ఉద్దేశపూర్వకంగా గాయపర్చినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇప్పుడు హత్యానేరం కింద జైలులోనే శాశ్వతంగా ఉంచే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కొడుకు ప్రాణాలను పణంగా పెట్టిన ఆ మూర్ఖుడు.. కాలక్రమంలో పశ్చాత్తాపం చెందగా, ఇప్పుడు కొడుకు మృతి చెందాడనే వార్త విని గుండెలు పలిగేలా రోదిస్తున్నాడు. -
చైన్స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయం?
-
చైన్స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయం?
వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. సైబరాబాద్ పోలీసులు ఈ నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులలో ఒకరికి బుల్లెట్ గాయం అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆటోనగర్ నుంచి చింతల్‌కుంట, సాగర్ రింగ్ రోడ్డు, కర్మన్‌ఘాట్ మీదుగా కంచన్‌బాగ్ వైపు వాళ్లు పరారైనట్లు సమాచారం సేకరించారు. దీంతో ఆ మార్గంలో ఉన్న అన్ని ఆస్పత్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎక్కడైనా ఆస్పత్రులలో వాళ్లు చికిత్స పొందుతూ ఉండొచ్చన్న అనుమానంతో అన్నిచోట్లా గాలిస్తున్నారు.