చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను స్థానికులు పట్టుకుని అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఉన్న కేంద్రీయ విద్యాలయం సమీపంలో జరిగింది.
హైదరాబాద్ నవాబ్‌సాబ్కుంటకు చెందిన మహమ్మద్ అమీర్, మహమ్మద్ వాజీద్ చైన్ స్నాచింగ్‌కు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిద్దరూ బైక్‌పై నుంచి జారి కిందపడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.