చైన్ స్నాచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. రోడ్లపై ఒంటిరిగా మహిళలు కనిపిస్తే పాపం.. మెడలోంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నారు.
ఖమ్మం: చైన్ స్నాచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. రోడ్లపై ఒంటిరిగా మహిళలు కనిపిస్తే పాపం.. మెడలోంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణాలను కూడా తీయ్యడానికి వెనుకాడటలేదు. ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఓ మహిళ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళను కొంతదూరం అనుసరించిన గొలుసు దొంగలు బైక్‌పై వెనకనుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.