First Indian to Own a Tesla Model X SUV - Sakshi
Sakshi News home page

భారత్‌లో మొదటి టెస్లా కార్‌ ఇతనిదే..

Published Wed, Jun 21 2023 2:12 PM | Last Updated on Wed, Jun 21 2023 2:33 PM

First Indian to own a Tesla car - Sakshi

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీలలో టెస్లా ఒకటి.  దాని వ్యవస్థాపకుడు,  సీఈవో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్‌ మస్క్‌. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్‌ను కలిశారు.

 

భారత్‌ ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మార్కెట్‌గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా ఇప్పటికీ దేశంలో అధికారికంగా లేదు.  తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ టెస్లా భారత్‌కు వస్తున్నట్లు ప్రకటించారు. 

అయితే టెస్లా అధికారికంగా భారతదేశంలోకి రానప్పటికీ, భారతీయ రోడ్లపైకి టెస్లా కార్లు ఎప్పుడో వచ్చేశాయి. దేశంలో మొదటి టెస్లా కారును ఓ వ్యక్తి 2017లో దిగుమతి చేసుకున్నారు. ఆయనేం ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ లేదా గౌతమ్ సింఘానియా కాదు. టెస్లాను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడు ఎస్సార్ గ్రూప్ సీఈఓ ప్రశాంత్ రుయా. టెస్లా మోడల్ X SUV బ్లూ కలర్‌ కార్‌ను ఆయన దిగుమతి చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నడుపుతూ ఆయన చాలా సార్లు కనిపించారు. 

ఎస్సార్‌ను స్థాపించిన రుయా కుటుంబంలోని రెండవ తరానికి చెందినవారు ప్రశాంత్ రుయా. ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్‌లో ఆయన ఏకైక పెట్టుబడిదారు. ఎస్సార్ సంస్థను 1969లో ప్రశాంత్ రుయా తండ్రి శశి రుయా, మేనమామ రవి రుయాలు స్థాపించారు.

ఇదీ చదవండి: అవును.. భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది! స్పష్టం చేసిన ఎలాన్‌ మస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement