Imported
-
ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతులపై కేంద్రం మరో ముందడుగు!
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతుల విషయంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక అడుగు ముందుకేసింది. దిగుమతిదారులకు లైసెన్సులను సజావుగా అందించడానికి కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నిమగ్నమైంది. ల్యాప్‌టాప్, కంప్యూటర్లపై ప్రభుత్వం దిగుమతి ఆంక్షలు విధించడంతో దిగుమతిదారులు నవంబర్ 1 నుండి డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. తయారీ కంపెనీ గత పనితీరును ప్రామాణికంగా తీసుకుని గతంలో లైసెన్సు జారీ చేసేవారు. దిగుమతుల ఆంక్షల కారణంగా భారత్‌కు ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై నిశితంగా నిఘా ఉంచేందుకు దోహదపడతాయి. భవిష్యత్ వృద్ధి ఆశయాల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీని కీలక ప్రాధాన్యతగా భారత్ గుర్తించింది. చైనా వెలుపల తమ కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్న ప్రపంచ దిగ్గజ కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణ యం దేశీ య తయారీని ప్రోత్సహిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీలు, సర్వర్స్ తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఫాక్స్‌కాన్ గ్రూప్, హెచ్‌పీ, డెల్, లెనోవోతో సహా 38 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల విలువ 2022–23లో 8.8 బిలియన్ డాలర్లు. ఇందులో పీసీలు/ల్యాప్‌టాప్‌ల వాటా 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పీసీలు/ల్యాప్‌టాప్‌ల ఎగుమతులు 163 బిలియన్ డాలర్లు. ఇందులో చైనా ఏకంగా 81 శాతం వా టా దక్కించుకుంది. లెనోవో, యాపిల్, డెల్, హెచ్ పీ అత్యధికంగా చైనాలో తయారు చేస్తున్నాయి. -
భారత్‌లో మొదటి టెస్లా కార్ ఇతనిదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీలలో టెస్లా ఒకటి. దాని వ్యవస్థాపకుడు, సీఈవో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్‌ను కలిశారు. భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మార్కెట్‌గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా ఇప్పటికీ దేశంలో అధికారికంగా లేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ టెస్లా భారత్‌కు వస్తున్నట్లు ప్రకటించారు. అయితే టెస్లా అధికారికంగా భారతదేశంలోకి రానప్పటికీ, భారతీయ రోడ్లపైకి టెస్లా కార్లు ఎప్పుడో వచ్చేశాయి. దేశంలో మొదటి టెస్లా కారును ఓ వ్యక్తి 2017లో దిగుమతి చేసుకున్నారు. ఆయనేం ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ లేదా గౌతమ్ సింఘానియా కాదు. టెస్లాను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడు ఎస్సార్ గ్రూప్ సీఈఓ ప్రశాంత్ రుయా. టెస్లా మోడల్ X SUV బ్లూ కలర్ కార్‌ను ఆయన దిగుమతి చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నడుపుతూ ఆయన చాలా సార్లు కనిపించారు. ఎస్సార్‌ను స్థాపించిన రుయా కుటుంబంలోని రెండవ తరానికి చెందినవారు ప్రశాంత్ రుయా. ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్‌లో ఆయన ఏకైక పెట్టుబడిదారు. ఎస్సార్ సంస్థను 1969లో ప్రశాంత్ రుయా తండ్రి శశి రుయా, మేనమామ రవి రుయాలు స్థాపించారు. ఇదీ చదవండి: అవును.. భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది! స్పష్టం చేసిన ఎలాన్ మస్క్ -
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ!
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న దాయాది దేశానికి జల రవాణా స్తంభించినట్లు తెలుస్తోంది. పాక్ దిగుమతి చేసుకోవాలనుకున్న 2వేల లగ్జరీ కార్లతో పాటు నిత్యవసర వస్తువులు సైతం సముద్రమార్గాన నిలిచిపోయినట్లు పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. పాకిస్తాన్లో ఆర్ధిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే అప్పులిచ్చేందుకు ఆర్ధిక సంస్థలు వెనకాడుతుండగాగా..విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. గతేడాది డిసెంబర్ 30తో గడిచిన వారానికి పాకిస్తాన్ కేంద్ర బ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 డాలర్లకు పడిపోయాయి.ఇది ఎనిమిదేళ్ల కనిష్టస్థాయి అని డాన్ ప్రచురించింది. ఖజనా ఖాళీ తాజాగా పాక్ ఖజనాలో విదేశీ మారక ద్రవ్యం లోటుతో అప్పులు, అవసరాల్ని తీర్చుకోలేక ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల్ని నిలిపివేసింది. ఆ దిగుమతుల్లో గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చెందిన 164 లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వినియోగించిన లగ్జరీ వాహనాల దిగుమతులు కూడా పెరిగాయని డాన్ వార్తాపత్రిక నివేదిక పేర్కొంది. తగ్గిన కొనుగోలు శక్తి నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో పాకిస్థాన్ దాదాపు 1,990 వాహనాలను దిగుమతి చేసుకుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు చాలా వరకు దిగుమతులు జరిగాయని, అక్టోబరు నుండి డిసెంబరు వరకు చాలా తక్కువ సంఖ్యలో కార్ల దిగుమతి అవుతున్నాయని సీనియర్ కస్టమ్స్ అధికారులు చెప్పినట్లు డాన్ పత్రిక నివేదించింది. కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల వాహనాల దిగుమతులు తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5వేల కంటైనర్ల నిండా మరోవైపు, ఓడరేవుల వద్ద ఫుడ్,బేవరేజెస్,క్లోతింగ్,షూస్,గ్యాస్ ఆయిల్‌తో పాటు ఇండస్ట్రియల్ గూడ్స్ ప్రొడక్ట్‌లైన ఎలక్ట్రిక్ వస్తువులతో ఉన్న 5 వేల కంటే ఎక్కువ కంటైనర్లను ఉంచినట్లు హైలెట్ చేసింది. పాక్ పర్యటనలో ఐఎంఎఫ్ బృందం ఇక డిసెంబర్ నెల నాటికి పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 బిలియన్లు ఉండగా ప్రస్తుతం అవికాస్త కనిష్ట స్థాయిలో 3.7 బిలియన్లకు పడిపోయాయి. అయితే ఈ అప్పుల నుంచి బయట పడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధుల బృందం ఈ వారం పాక్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో అక్కడి పరిస్థితుల్ని అంచనా వేసి రుణాల్ని అందించనుంది. -
చిన్నారి ప్రాణం నిలిపేందుకు 6 కోట్ల జీఎస్టీ రద్దు
ముంబై: జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఐదు నెలల చిన్నారి తీరా కామత్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉదారం చూపారు. ఈ చిన్నారికి రూ.16 కోట్ల విలువైన మందులను దిగుమతి చేసుకునేందుకు 6 కోట్ల రూపాయల జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ మొత్తాన్ని మోదీ రద్దు చేశారు. ఈ చిన్నారి ఆపరేషన్ల కోసం దాతల నుంచి రూ.16 కోట్లను ముంబైలోని కామత్ కుటుంబం సేకరించింది. ఈ పాపాయిని వ్యాధి నుంచి కాపాడేందుకు జన్యుమార్పిడి థెరఫీ చేయాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన జోల్గెన్స్మా అనే ఔషధాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఖర్చుకి తోడు రూ.6 కోట్ల జీఎస్టీ భారం పడుతోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు∙మోదీ చొరవ చూపి జీఎస్టీ రద్దు చేశారు. 2021 జనవరిలో కుమార్తె వైద్య పరిస్థితిని మోదీకి పాప తల్లిదండ్రులు చెప్పారు. మందుల దిగుమతిపై పన్నులన్నింటినీ మినహాయించాలని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు లేఖలు రాశారు. ఈ చిన్నారి తల్లిదండ్రులు ఈ ఖర్చుని భరించే స్థితిలో లేకపోవడంతో వారు విరాళాల ద్వారా ఈ మొత్తాన్ని దాతల నుంచి సేకరించారు. అందుకే ఈ కేసుని ప్రత్యేక కేసుగా భావించి పన్నులు రద్దుచేయాలని ఫడ్నవీస్ కోరారు. లైఫ్ సేవింగ్ డ్రగ్ పై విధించే అన్ని పన్నులను తీరా విషయంలో రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. తీరా తల్లిదండ్రులు ప్రియాంక, మిహిర్ కామత్‌లు మోదీ ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 14, 2020న ఈ పాప పుట్టింది. పుట్టిన రెండు వారాల తరువాత ఈమెకు ఈ జన్యుపరమైన లోపం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పాలు తాగే సమయంలో ఈ పాప ఊపిరి తీసుకోని పరిస్థితి వస్తుంది. దీన్ని స్పైనల్ మస్క్యులర్ ఆస్ట్రోఫీస్ అంటారు. -
వేరుశెనగ పంపిణీ నేడే
ఇంకా చాలీచాలని సబ్సిడీ విత్తనాలే కావాల్సింది లక్ష క్వింటాళ్లు వచ్చింది 12వేల క్వింటాళ్లే చిత్తూరు (అగ్రికల్చర్): సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయల ధరలను నిర్ణయించడానికే సమయాన్నంతా వృథా చేసిన అధికారులు వాటిని జిల్లాకు దిగుమతి చేసుకోవడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖరీఫ్ సీజనుకు రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనకాయలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం నెల రోజులుగా వాటి ధర నిర్ణరుుంచే విషయంలో మీనమేషాలు లెక్కించింది. ఎట్టకేలకు ఈ నెల 21 తేదీన ధర ప్రకటించింది. కానీ ఇప్పటికి కూడా అవసరమైన మేరకు విత్తనకాయలను దిగుమతి చేసుకోలేకపోరుుంది. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఈ నెల 25 (బుధవారం)న చాలీచాలని విత్తనాలతోనే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ సీజనుకు వేరుశెనగ సాగు సాధారణ విస్తీర్ణం 1,36,479 హెక్టార్లు. ఇందుకుగాను 1.05 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ కాయలు అవసరం. ఇందులో ఇప్పటికి 12 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. నెల చివరలోనే వేరుశెనగ కాయలు రైతులకు అందించాల్సి ఉంది. సాధారణంగా జూన్ 15 నుంచి జూలై 15వ తేదీలోగా వేరుశెనగ కాయలు విత్తేందుకు మంచి అదను. ఈ ఏడాది ప్రభుత్వం సీజను దాటిపోయే సమయానికి విత్తనకాయల ధర ప్రకటించింది. దీనికితోడు ఇప్పటికి జిల్లాకు చేరిన 12 వేల క్వింటాళ్ల విత్తనకాయలతో 51 మండలాల్లో అధికారులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అధికారులు ప్రకటించిన ప్రకారం ఈ నెలాఖరుకుగానీ రైతులకు పూర్తి స్థారుులో విత్తనకాయలు పంపిణీచేసే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. తొలుత 35 వేల క్వింటాళ్లకాయలను జిల్లాకు తెప్పించి పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ ప్రకటించారు. కానీ అది నెరవేరలేదు.