ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈఓ ఇలొన్మస్క్ గతంలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘వి రోబోట్’ ఈవెంట్‌లో కృత్రిమమేధ సాయంతో పనిచేసే ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు ఆప్టిమస్ రోబోలను పరిచయం చేశారు.
టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ గతంలో ఏజీఎంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. తాజాగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు రోబోల దండును పరిచయం చేశారు.
— Elon Musk (@elonmusk) October 11, 2024
ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లా
భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని గతంలో మస్క్ చెప్పారు. కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. తయారీ రంగంతోపాటు రోజువారీ జీవితంలో రోబోలు పాత్ర కీలకంగా మారనుందని తెలిపారు. ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదని గతంలో మస్క్ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment