‘ఐ రోటోట్’ సినిమా చూశారా..? అందులో కార్లు డ్రైవర్ ప్రమేయం లేకుండానే వాటికవే ప్రయాణిస్తుంటాయి. వాటంతటవే పార్క్ చేసుకుంటాయి. అచ్చం టెస్లా కంపెనీ అలాంటి కార్లను తయారు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘రోబోవన్’ అనే కారును ఆవిష్కరించారు. టెస్లాకు చెందిన ‘వి రోబోట్’ ఈవెంట్‌లో కంపెనీ సీఈఓ ఇలోన్‌మస్క్ ఈ కారుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్‌లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ‘ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని మస్క్ తెలిపారు.
Robovan seats 20 & can be adapted to commercial or personal use – school bus, RV, cargo pic.twitter.com/CtjEfcaoHI
— Tesla (@Tesla) October 11, 2024
ఈమేరకు రోబోవన్ రోడ్లపై పరుగెత్తిన వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు. ఈ ఈవెంట్‌లో సైబర్ క్యాబ్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు ఇలొన్‌మస్క్ తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్‌లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Robotaxi pic.twitter.com/zVJ9v9yXNr
— Tesla (@Tesla) October 11, 2024
Comments
Please login to add a commentAdd a comment