tesla motor
-
మస్క్ ఆవిష్కరణలు.. 2006 నుంచి 2024 వరకు (ఫోటోలు)
-
టెస్లా రోబో కారు
‘ఐ రోటోట్’ సినిమా చూశారా..? అందులో కార్లు డ్రైవర్ ప్రమేయం లేకుండానే వాటికవే ప్రయాణిస్తుంటాయి. వాటంతటవే పార్క్ చేసుకుంటాయి. అచ్చం టెస్లా కంపెనీ అలాంటి కార్లను తయారు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘రోబోవన్’ అనే కారును ఆవిష్కరించారు. టెస్లాకు చెందిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కంపెనీ సీఈఓ ఇలోన్‌మస్క్ ఈ కారుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ‘ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని మస్క్ తెలిపారు.Robovan seats 20 & can be adapted to commercial or personal use – school bus, RV, cargo pic.twitter.com/CtjEfcaoHI— Tesla (@Tesla) October 11, 2024ఈమేరకు రోబోవన్ రోడ్లపై పరుగెత్తిన వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు. ఈ ఈవెంట్లో సైబర్ క్యాబ్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు ఇలొన్‌మస్క్ తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.Robotaxi pic.twitter.com/zVJ9v9yXNr— Tesla (@Tesla) October 11, 2024 -
టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?
టెస్లా తన కార్ల తయారీ పరిశ్రమను గుజరాత్లో స్థాపించే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గుజరాత్లో జనవరి 2024లో జరిగే సమ్మిట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెస్లా చాలా రోజులుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కేంద్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నందున ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం..గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సనంద్, ధోలేరా, బెచరాజీ ప్రదేశాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చేందుకు టెస్లా గుజరాత్ ప్లాంట్‌ను వినియోగించనున్నట్లు తెలిసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమక్షంలో గుజరాత్లో టెస్లా ప్లాంట్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కథనాల ద్వారా తెలుస్తుంది. టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా గతంలో కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే.. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం గతంలో కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
టెస్లాకు త్వరలో లైన్ క్లియర్.. భారత్‌లోకి ప్రవేశం!
ఎలాన్‌మస్క్‌కు చెందిన టెస్లా కార్ల గురించి వినడం..సామాజిక మాధ్యమాల్లో చూడడం తప్పా నేరుగా భారత్‌లో ఉపయోగించింది లేదు. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల టెస్లా కార్లకు అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈసారి 2024 జనవరి నాటికి అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన సమావేశంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. టెస్లాతో సహా ఇతర పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్చలు జరిగాయని ఒక ఉన్నత అధికారి చెప్పినట్లు తెలిసింది. జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. అప్పటినుంచి కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లాను భారత్‌కు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. 2024 జనవరిలో అనుమతులు లభిస్తే టెస్లా కార్లను వీలైనంత త్వరలో భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు చర్చల్లో పురోగతి లేకపోవడంతో టెస్లా గతంలో భారత్‌లో ప్రవేశించలేదు. దాదాపు రూ.33లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60% వరకే దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40% ట్యాక్స్ ఉండేలా అభ్యర్థించింది. టెస్లా వాహనాలను ఎలక్ట్రిక్ కార్లుగా కాకుండా లగ్జరీ కార్లుగా గుర్తించాలని తెలిపింది. భారత్‌లో స్థానిక తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ముందే తమ కార్ల విక్రయాన్ని ప్రారంభించాలని భావించింది. అయితే దిగుమతి సుంకం రాయితీల కోసం స్థానిక తయారీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కస్టమ్స్ డ్యూటీ రాయితీల స్థానంలో తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందిస్తూ, ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని టెస్లాకు వివరించింది. ఇదీ చదవండి: త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ భారత కస్టమ్స్ డ్యూటీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోకార్బన్ ఆధారిత వాహనాలను సమానంగా పరిగణిస్తారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి భారీగా సుంకాలను విధిస్తున్నారు. అయితే ఈవీ తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించేలా పర్యావరణ అనుకూల వాహనాలపై తక్కువ పన్ను విధించేలా కొత్త దిగుమతి పాలసీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వెసులుబాటు టెస్లాకు మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే ఏ కంపెనీకైనా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. -
పనికిమాలినోడు.. అలాంటి వేస్ట్ఫెలోని నా జీవితంలో చూడలేదు - ఎలాన్‌మస్క్
ఫోర్డ్, షెవర్లే, ఫోక్స్‌వ్యాగన్‌లను వెనక్కి తోసి ఇరవై ఏళ్లు నిండకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఎదిగింది టెస్లా. అయితే ఈ కంపెని ఎవరు స్థాపించారు. ఎలాన్ మస్క్ ఎలా వచ్చాడనే అంశంపై పదేళ్లుగా చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఎలాన్‌మస్క్. టెస్లా ఓ గొట్టం కంపెనీ ఇటీవల ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్యూలో టెస్లా పుట్టుపూర్వోత్తరాలను వివరించాడు ఎలాన్ మస్క్. తాను టెస్లాలో చేరే నాటికి ఆ కంపెనీ పూర్తిగా ఒక షెల్ (గొట్టం) కంపెనీగా ఉందని ఎలాన్ మస్క్ అన్నారు. పేరుకే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీగా రిజిస్ట్రర్ అయి ఉంది తప్పితే అక్కడ ఎటువంటి డిజైన్లు లేవు, ప్రోటోటైప్ లేదు, ఉద్యోగులు ఎవరూ లేరు. కేవలం ఏసీ ప్రొపల్షన్తో జీరో కారును తయారు ఆలోచన తప్ప మరేం లేదని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. తాను కంపెనీలోకి అడుగు పెట్టిన తర్వాతే టెస్లా రూపురేఖలు మారాయని ఎలాన్ మస్క్ చెప్పారు. 2003లో.. ఇక టెస్లా విషయానికి వస్తే మార్టిన్ ఎబెర్హార్డ్, మార్క్ టార్పెనింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే లక్ష్యంతో 2003లో టెస్లాను ఓ స్టార్టప్‌గా స్థాపించారు. ఆ తర్వాత కాలంలో ఎలాన్‌మస్క్‌తో పాటు జేబీ స్ట్రాబ్యుయేల్లు ఈ కంపెనీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మార్టిన్ ఎబెర్హర్డ్ను బోర్డు నుంచి తొలగించారు. ఆ సమయంలో అతని పక్షనా ఎవరూ నిలవలేదు. దీనిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్థాపించింది ఎవరు టెస్లా స్థాపన అది ఎదిగిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. చాలా మంది ఎబెర్హార్డ్ పెట్టిన కంపెనీని ఎలాన్ మస్క్ అతని బృందం అప్పనంగా దోచుకున్నారనే విధంగా కామెంట్లు చేస్తుంటారు. ఇప్పటికీ దీనిపై మస్క్ అనేక సార్లు వివరణ ఇచ్చినా.. ప్రశ్నల పరంపర.. అనుమానపు చూపులు మాత్రం ఆగడం లేదు. ఈ వరుసలోనే ఎబర్హర్డ్ను ఎందుకు బయటకు పంపాల్సి వచ్చిందనే ప్రశ్న మస్క్‌కి తాజా ఇంటర్యూలో ఎదురైంది. పనికిమాలినోడు టెస్లాను స్థాపించడం తప్పితే ఎబర్హర్డ్కి సంబంధించి పెట్టుబడి లేదని ఎలాన్‌మస్క్ వివరించాడు. పైగా అతని పనితీరు దారుణంగా ఉండేందని తెలిపారు. కేవలం టెస్లా నుంచి బయటకు వెళ్లాక.. ఈ కంపెనీని తానే స్థాపించినట్టు బలంగా ప్రచారం చేసుకోవడం మినహా అతను ఏమీ సాధించలేదని మస్క్ దుయ్యబట్టారు. ఎబర్‌హార్డ్ లాంటి పనికి మాలిన వాడిని తానెప్పుడూ చూడలేదన్నారు ఎలాన్‌మస్క్. టెస్లా ఎదుగుదలకు తాను, జేబీ స్ట్రాబ్యుయేల్ ఇతర బృందం తీవ్రంగా శ్రమించామని తెలిపారు. గత ఏప్రిల్‌లో టెస్టా కంపెనీ ఎవరు స్థాపించారు. తాను ఎలా కంపెనీలోకి వచ్చింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ ఏడాది రెండోసారి వివరించారు ఎలాన్‌మస్క్. గత ఏప్రిల్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా ఎలాన్‌మస్క్ ఓపిగ్గా బదులిచ్చాడు. Not even close to that. It was a shell corp with no employees, no IP, no designs, no prototype, literally nothing but a biz plan to commercialize AC Propulsion’s Tzero car, which was introduced to me by JB Straubel, *not* Eberhard. Even name “Tesla Motors” was owned by others! — Elon Musk (@elonmusk) April 21, 2022 When Eberhard was fired unanimously by the board in July 2007 (for damn good reasons), no one left with him. That says it all. — Elon Musk (@elonmusk) April 21, 2022 చదవండి: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్ మస్క్ -
డ్రైవర్‌లెస్ కార్లు రయ్!
సింగపూర్‌లో వీటితో ప్రయోగాత్మక ట్యాక్సీ సేవలు షురూ • అమెరికాలో ప్రారంభానికి ఉబెర్ సన్నాహాలు • రేసులో గూగుల్, ఫోర్డ్, జీఎం, యాపిల్, టెస్లా • 2021 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి! • హై సైబర్ సెక్యూరిటీ ముఖ్యమంటున్న నిపుణులు మనకు ట్రాన్స్ఫార్మర్స్ సినిమా గుర్తుండే ఉంటుంది. అది పిల్లలతోపాటు పెద్దలను కూడా విపరీతంగా ఆకర్షించింది. ఇందులో కార్లు కార్లు మాట్లాడుకుంటాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు నిజజీవితంలో మనకు ఎదురు కాబోతుంది. వచ్చే ఐదేళ్లలో డ్రైవర్ల అవసరం లేకుండానే కార్లు మనల్ని గమ్యస్థానాలకు చేర్చబోతున్నాయి. పలు పెద్ద పెద్ద కంపెనీలు డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాయి. ఆ కంపెనీల్లో మనకుముందుగా గుర్తొచ్చే పేరు గూగుల్. ఇదే మొదటిగా డ్రైవర్‌లెస్ కార్ల తయారీకి శ్రీకారం చుట్టింది. తర్వాత టెస్లా మోటార్స్, జీఎం, ఫోర్డ్ వంటి కంపెనీలు గూగుల్‌ను అనుసరించాయి. ఇప్పుడు ఉబెర్ వీటికి జత కలిసింది. దీంతో కంపెనీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. కాగా న్యూటానమీ అనే స్టార్టప్ గురువారం డ్రైవర్‌లెస్ కార్ల ట్యాక్సీ సర్వీసులను సింగపూర్‌లో ట్రయల్స్ విధానంలో ప్రారంభించింది. అమెరికాలో ఉబెర్ సెల్ఫ్‌డ్రైవింగ్ రైడ్స్ రైడ్ షేరింగ్ సర్వీసెస్ సంస్థ ఉబెర్ ప్రయాణికుల రవాణా కోసం కొన్ని వారాల్లో సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లను ఉపయోగించనున్నది. ఈ సేవలను తొలిగా అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ప్రారంభించనున్నది. తర్వాత వీటిని ఇతర ప్రాంతాలకు విస్తరించన్నుది. ఇక్కడ అత్యవసర పరిస్థితులను నియంత్రించడానికి కారులో ఒక డ్రైవర్ కూడా ఉంటాడు. కాగా ఉబెర్ 2021 నాటికి పూర్తిస్థాయి అటానమస్ కార్లను మార్కెట్లోకి తెచ్చే అవకాశముంది. డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధి, తయారీకి స్వీడన్ కార్ల కంపెనీ వోల్వోతో కలిసి 300 బిలియన్ డాలర్ల డీల్‌కు తెరలేపింది. గూగుల్, ఫోర్డ్, జీఎం, యాపిల్, టెస్లా... ⇒ గూగుల్ 2009 నుంచి అటానమస్ కార్లను రోడ్లపై ప్రయోగాత్మకంగా తిప్పుతూనే ఉంది. ప్రస్తుతం ఇది బ్రేక్ పెడల్స్, స్టీరింగ్ ఉండని కార్లపై పరీక్షలు నిర్వహిస్తోంది. ఇది తన సాఫ్ట్‌వేర్‌ను ఇతర వాహన తయారీ కంపెనీలకు విక్రయించుకోవచ్చు లేదా షేర్ రైడింగ్ సంస్థలతో జతకట్టొచ్చు. ⇒ ఉబెర్ లాగానే సెల్ఫ్‌డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది ప్రారంభించడానికి జీఎం ప్రయత్నిస్తోంది. ఇది ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిక్సో, ఆరిజోనాల్లో వంటి ప్రాంతాల్లో అటానమస్ షెవర్లే బోల్ట్ కారును పరీక్షిస్తోంది. ⇒ మెర్సిడెస్ కూడా డ్రైవర్‌లెస్ కార్ల తయారీలో నిమగ్నమైంది. ⇒ రైడ్ షేరింగ్ సర్వీసుల ద్వారా పూర్తి స్థాయి అటానమస్ వెహికల్స్‌ను 2021 నాటికల్లా మార్కెట్లోకి తీసుకొస్తామని ఫోర్డ్ ప్రకటించింది. ⇒ ఇక టెస్లా కూడా అటానమస్ కార్ల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇది ఇటీవలే (మే నెలలో) డ్రైవర్‌లెస్ కార్లపై పరీక్షలు నిర్వహించింది. కానీ అందులో ప్రమాదం జరిగి డ్రైవర్ మరణించారు. ⇒ యాపిల్ కూడా డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికి ప్రయత్నిస్తోంది. ఇది ఇప్పటికే కొన్ని వందల మంది ఇంజినీర్లకు టైటాన్ ప్రాజెక్టులో భాగంగా నియమించుకుంది. ⇒ టయోటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎంఐటీ, డెల్ఫి ఆటోమోటివ్, కాంటినెంటల్, సౌత్‌వెస్ట్ రీసెర్చ్, బైదూ వంటి సంస్థలు కూడా డ్రైవర్‌లెస్ కార్ల ఏర్పాటుకు నియామకాలను చేపట్టాయి. 600 బిలియన్ గంటలు వాహనాల్లోనే కాలం విలువైంది. సమయానికి అత్యంత ప్రాధాన్యమిస్తోన్న ఈ కాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకుల మాట. ప్రస్తుతం జనాలు వాహనాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్యాసెంజర్ వాహనాలు వార్షికంగా 10 ట్రిలియన్ మైళ్ల దూరం ప్రయాణిస్తున్నాయని అంచనా. వీటి సగటు వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ప్రజలు 600 బిలియన్ గంటలు వాహనాల్లోనే గడిపేస్తున్నారు. డ్రైవర్‌లెస్/అటానమస్ వెహికల్స్ సర్వీస్ ప్రొవైడర్లు, తయారీదారులు ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని సైబర్‌మీడియా రీసెర్చ్ హెడ్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ థామస్ జార్జ్ తెలిపారు. డేటా ప్రధానం.. ఏ అటానమస్ వెహికల్‌కు అయినా డేటా ప్రధానమని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రీసెర్చ్ మేనేజర్ (ఎంటర్ప్రైజ్) గౌరవ్ శర్మ అభిప్రాయపడ్డారు. దీంతో సురక్షితమైన సులభమైన ప్రయాణం సాధ్యమౌతుందన్నారు. సమాచారాన్ని స్వీకరించి, ప్రాసెసింగ్ చేసుకొని, దీని ద్వారా ఇతర భాగాలను నియంత్రించడం క్లిష్టమైన ప్రక్రియని వివరించారు. డ్రైవర్‌లెస్ కార్లు విజయవంతమవ్వాలంటే.. చట్టాలు, నిబంధనలు, నియంత్రణలు, ట్రాఫిక్ సిస్టమ్, ఇన్ఫ్రా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్, మాన్యుఫాక్చరింగ్, డేటా అండ్ ఇన్ఫర్మేషన్ నిర్వహణ, ప్రాసెసింగ్ వ్యవస్థ వంటి అంశాలు వేగంగా మారాల్సి ఉందని పేర్కొన్నారు. భారత్‌లో చాలా మందికి వాహన రంగం ఉపాధిని కల్పిస్తోందని, వారు కూడా కొత్త టెక్నాలజీకి అలవాటు పడాల్సి ఉంటుందని, నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో డ్రైవర్‌లెస్ కార్లు జనాలకు సుపరిచితం కావొచ్చన్నారు. హ్యాక్ అయితే అంతే! ఆటోమెటిక్, సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లు హ్యాకింగ్‌కు గురైతే సంభవించే పరిణామాలు మామూలుగా ఉండబోవని నిపుణులు పేర్కొన్నారు. చాలా అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. డ్రైవర్‌లెస్ కార్లను తయారుచేసే వారు హై సెక్యూరిటీ, సైబర్ భద్రతలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. టెస్లా/గూగుల్ కార్ల ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇవీ ప్రయోజనాలు... ⇒ పార్కింగ్ సమస్యను తప్పించుకోవచ్చు. ⇒ కంపెనీలు భద్రతకు అధిక ప్రాధాన్యంఇస్తున్నాయి. ⇒ సాధారణంగా డ్రైవర్లకు వేతనాలు ఇవ్వాలి. ఇక్కడ వాటితో పని ఉండదు. అలాగే వారు 24 గంటలూ పనిచేయరు. ఇవి అలా కాదు. వీటిల్లో ఎప్పుడైనా.. ఎక్కడికైనా వెళ్లొచ్చు. ⇒ పిల్లలను స్కూళ్లకు పంపొచ్చు. పిక్అప్ చేసుకోవచ్చు. మనం ఆఫీస్‌కు రావొచ్చు. ఇంట్లోని అందరూ ఒకే కారును వాడొచ్చు. ⇒ కంపెనీలు వారి స్టాఫ్, ఉద్యోగుల రవాణాకు వాటిని వినియోగించుకోవచ్చు.