రజినీకాంత్ నటించిన రోబో సినిమా చూసినప్పటి నుంచి.. చాలా మందికి రోబోలు మనిషిలాగే ప్రవర్తిస్తాయా? అనే అనుమానం వచ్చింది. అయితే రోబోలు మనుషులను మించిపోయే రోజులు భవిష్యత్తులో రానున్నట్లు, కొన్ని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. మనిషిలా నడిచే ఒక రోబో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) సారథ్యంలో టెస్లా.. కార్లను మాత్రమే కాకుండా.. రోబోలను కూడా రూపొందిస్తోంది. ఇలాంటి రోబోలు మనిషి మాదిరిగానే నడుస్తున్నాయి. వీడియోలో గమనిస్తే.. ఒక రోబో ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని దిగుతూ.. కొంత తడబడింది. అంతలోనే కంట్రోల్ చేసుకుని కిందకి పడిపోకుండా.. మెల్లగా దిగడం చూడవచ్చు.
ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని నెమ్మదిగా దిగటమే కాకుండా.. ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని కూడా రోబో ఎక్కడం కూడా చూడవచ్చు. ఇదంతా చూస్తుంటే.. రోబోలు మనుషుల్లా ప్రవర్తించే రోజులు వచేస్తున్నాయని స్పష్టంగా అవగతమవుతోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment