
టెస్లా (Tesla) కంపెనీ తన కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్‌గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది.
టెస్లా తన భారత కార్యకలాపాలను.. తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కారుతో ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిని కంపెనీ బెర్లిన్ గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ. 21 లక్షలు ఉంటుంది. ఈ కారును చైనా, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లలో కూడా విక్రయించే అవకాశం ఉంది. అమెరికాలో కూడా దీని ఉత్పత్తిని పెంచడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.
సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు
టెస్లా కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయించనున్న ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment