అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో.. | Missing Boys Found Dead in Wood Box at East Godavari | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో విగత జీవులుగా

Jun 1 2019 3:47 PM | Updated on Mar 21 2024 8:18 PM

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం చిన్నయ్య పాలెం లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు చివరికి చెక్క పెట్టెలో విగత జీవులుగా కనిపించారు. అనూహ్యంగా గ్రామంలోని పాడుబడిన పాఠశాలలో ఉన్న చెక్కపెట్టలో వీరిద్దరు శవాలుగా కనిపించారు. కాగా  బేలెం ప్రశాంత్ కుమార్, చెడెం కార్తీక్‌ కనిపించడం లేదంటూ గత నెల 26న వారి తల్లిదండ్రులు జడ్డంగి పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేసారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన చిన్నారుల గురించి వెతకటం ప్రారంభించారు. అయితే ఆడుకుంటూ వీరిద్దరూ పెట్టెలోకి దూరి ఉంటారని, మూత మూసుకుపోవడంతో బయటకు రాలేక చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement