
విద్యార్థి ఆత్మహత్య (ప్రతీకాత్మక చిత్రం)
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పులి సునందకుమార్‌రెడ్డి అనే విద్యార్థి గురువారం బలవన్మరణం చెందాడు. ఎవరూ లేని సమయంలో కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మానసిక ఒత్తిడితోనే సునందకుమార్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి స్వస్థలం గుంటూరు జిల్లా అని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.