అద్దెకు తీసుకున్న కార్లను తనఖాపెట్టిన మహిళ
నలుగురు నిందితుల అరెస్ట్ 21 కార్లు స్వా«దీనం
గచ్చిబౌలి: సెల్ఫ్ డ్రైవ్ పేరుతో కార్లు అద్దెకు తీసుకుని మరొకరి వద్ద కుదవపెట్టిన మహిళతో పాటు మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో నివాసం ఉంటున్న జుపూడి ఉషా సెల్ఫ్ డ్రైవ్ కోసం కార్లు అద్దెకు ఇస్తే రోజుకు రూ.2 నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లిస్తానని ప్రచారం చేసుకుంది.
దీంతో పలువురి నుంచి కార్లు తీసుకున్న ఆమె డ్రైవర్ తుడుముల మల్లేష్‌తో కలిసి వాటిని బీదర్‌కు చెందిన సాగర్ పాటిల్, అనీల్ జమానే వద్ద తనఖా పెట్టి రూ.50 లక్షలు తీసుకుంది. ఆవే కార్లను సాగర్, అనీల్ బీదర్, బల్కీ జిల్లాల్లో ఇతర వ్యక్తుల వద్ద కుదువపెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. మూడు నెలలైనా అద్దె డబ్బులు ఇవ్వక పోవడంతో కార్ల యజమానులు ఉషాను నిలదీయగా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తుంది. అద్దె ఇవ్వక పోవడం, కార్ల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జియో ట్యాగ్‌ను తొలగించి కార్లను కర్నాటకలోని బీదర్, బల్కీ జిల్లాలకు తరలించినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించారు.దీంతో నిదితులు ఉషా, మల్లేష్, సాగర్, అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు వారి నుంచి రూ.2.5 కోట్ల విలువైన 21 వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. స్వా«దీనం చేసుకున్న వాహనాల్లో 4 మహీంద్రా థార్, 10 ఎర్టిగా, ఒక ఇన్నోవా క్రిస్టా, 3 స్విఫ్ట్ కార్లు, పది ఐ–10 , ఒక ఐ–20, ఒక వెన్యూ కార్లు ఉన్నాయి. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న, డీఐ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment