car rental
-
సెల్ఫ్ డ్రైవ్ పేరిట ఘరానా మోసం
గచ్చిబౌలి: సెల్ఫ్ డ్రైవ్ పేరుతో కార్లు అద్దెకు తీసుకుని మరొకరి వద్ద కుదవపెట్టిన మహిళతో పాటు మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో నివాసం ఉంటున్న జుపూడి ఉషా సెల్ఫ్ డ్రైవ్ కోసం కార్లు అద్దెకు ఇస్తే రోజుకు రూ.2 నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లిస్తానని ప్రచారం చేసుకుంది. దీంతో పలువురి నుంచి కార్లు తీసుకున్న ఆమె డ్రైవర్ తుడుముల మల్లేష్‌తో కలిసి వాటిని బీదర్‌కు చెందిన సాగర్ పాటిల్, అనీల్ జమానే వద్ద తనఖా పెట్టి రూ.50 లక్షలు తీసుకుంది. ఆవే కార్లను సాగర్, అనీల్ బీదర్, బల్కీ జిల్లాల్లో ఇతర వ్యక్తుల వద్ద కుదువపెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. మూడు నెలలైనా అద్దె డబ్బులు ఇవ్వక పోవడంతో కార్ల యజమానులు ఉషాను నిలదీయగా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తుంది. అద్దె ఇవ్వక పోవడం, కార్ల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జియో ట్యాగ్‌ను తొలగించి కార్లను కర్నాటకలోని బీదర్, బల్కీ జిల్లాలకు తరలించినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించారు.దీంతో నిదితులు ఉషా, మల్లేష్, సాగర్, అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు వారి నుంచి రూ.2.5 కోట్ల విలువైన 21 వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. స్వా«దీనం చేసుకున్న వాహనాల్లో 4 మహీంద్రా థార్, 10 ఎర్టిగా, ఒక ఇన్నోవా క్రిస్టా, 3 స్విఫ్ట్ కార్లు, పది ఐ–10 , ఒక ఐ–20, ఒక వెన్యూ కార్లు ఉన్నాయి. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న, డీఐ సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ శాఖల్లో అద్దెకు సొంత వాహనాలు..
ఉన్నతమైన ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం.. అయినప్పటికీ కాసులకు కక్కుర్తి పడుతున్నారు. గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నా అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వాహన సౌకర్యాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. సొంత వాహనాలనే అద్దెకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా పలుశాఖల్లో సాగుతున్న ‘అద్దె’ బాగోతంపై సాక్షి ప్రత్యేక కథనం. సాక్షి,చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి అద్దె వాహనాల దందా సాగుతోంది. ట్రెజరీ, రెవెన్యూ, ఎంపీడీఓలు, విద్యా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, హౌసింగ్, మున్సిపల్ అధికారులు.. ఇతర శాఖల్లో సొంత కార్లను వినియోగిస్తూ ప్రతి నెలా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పలు కార్యాలయాల ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రజాసేవ నిమిత్తం క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు అవసరమైతే వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లాస్థాయి అధికారి వాహనానికి నెలకు రూ.45వేలు, మండలస్థాయి అధికారి అయితే రూ.35వేలు అద్దె చెల్లిస్తోంది. నిరుద్యోగులకు బ్యాంకు రుణాలు, కార్పొరేషన్ల కింద సబ్సిడీపై ఓనర్ కమ్ డ్రైవర్స్కీం ప్రవేశపెట్టి ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి పలువురు ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నారు. తమ సొంత వాహనాలను వారు పనిచేస్తున్న శాఖలోనే అద్దెకు వినియోగిస్తున్నారు. మరికొందరు బినామీ పేర్లతో బిల్లులు పెట్టి అద్దెను జేబుల్లోకి వేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు! కొందరు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకుండానే నకిలీ బిల్లులు పెడుతున్నారు. తమకు కేటాయించిన వాహనంలో నెలకు 2,500 కిలోమీటర్లు తిరగాల్సి ఉంది. అన్ని కిలోమీటర్లు తిరగకపోయినా నకిలీ బిల్లులు పెట్టి ప్రతి నెలా అద్దె పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఏళ్ల తరబడి గుట్టుగా దందా సాగిస్తున్నారు. ఉపాధికి గండి జిల్లా వ్యాప్తంగా దాదాపు 85 ప్రభుత్వ శాఖలున్నాయి. అందులో సగానికి పైగా శాఖల్లోని అధికారులు వైట్‌బోర్డు వాహనాలను వినియోగిస్తుండడం గమనార్హం. అదే ఎల్లోబోర్డు వాహనాలను అద్దెకు తీసుకుంటే పలువురికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని అద్దెకు పెడితే సంబంధిత బిల్లుల మంజూరుకు చుక్కలు చూపిస్తున్నారు. -
హైదరాబాద్‌లో బయటపడ్డ భారీ మోసం.. కార్లను అద్దెకు తీసుకుని
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. కార్లను అద్దెకు తీసుకొని బహిరంగ మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా ట్రావెల్ ఏజెన్సీ, ఓనర్ల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటుంది. ఆ తర్వాత సబ్సిడీ కార్ల పేరుతో అద్దెకు తీసుకున్న కార్లను బహిరంగ మార్కెట్లో అమ్ముతారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలో కార్లు వస్తున్నాయంటూ నమ్మబలికి.. జనాలను మోసం చేస్తారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులు హైదరాబాదులో పలు సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా మోసం వెలుగులోకి రావడంతో వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబరాబాద్ పోలీసులు సోమవాంర ఈ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 50 అత్యంత ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సబ్సిడీ కార్ల పేరుతోటి విక్రయాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కార్ల విలువ దాదాపుగా నాలుగున్నర కోట్లు రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. అద్దెకు తీసుకున్న కార్లకు రెండు మూడునెలల వరకు రెంట్ చెల్లించి ఆ తర్వాత మొహం చాటేయెడం వీరికి అలవాటని తెలిపారు పోలీసులు. ముఠాకు చెందిన పల్లె నరేష్ , బడావత్ రాజునాయక్, కలుముల వికాస్, గొల్లె భరత్ జోషిబానూరి ఎలక్షన్ రెడ్డి, తాళ్ల నర్స్మింహా రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చదవండి: ‘ఇండస్ వివా’ చీటింగ్ కేసు: భారీ ఆఫర్లతో ఎర -
పెళ్లి చూపుల కోసం కారు తీసుకెళ్లి.. ఇవ్వనుపో!
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి చూపుల కోసం నాలుగు రోజులు కారు వాడుకుంటానని తీసుకెళ్లి మళ్లీ కారు ఇవ్వమని అడిగితే ఇవ్వనుపో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కమలాపురి కాలనీ ఫేజ్–2లో నివసించే కాట్రగడ్డ సుధాకర్ గత అక్టోబర్ నెలలో విజయవాడ పెనమలూరుకు చెందిన తన స్నేహితుడు మండలపు ప్రసన్నకుమార్‌కు తన క్రెటా కారును ఇచ్చాడు. తిరిగి ఎన్నిసార్లు కారు ఇవ్వమని అడిగినా వివిధ కారణాలు చూపుతూ తప్పించుకోసాగాడు. ఇటీవల గట్టిగా అడిగితే ఇవ్వనుపో ఈ కారు నాది తిరిగి నీ మీదే కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని, గతంలో కూడా తన ఇంట్లో బంగారం అదృశ్యమైన ఘటనలోనూ ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తు చేశారు. తన కారు రిజిస్ట్రేషన్ తన పేరు మీదే ఉందని అక్రమంగా కారును వాడుకుంటున్న ప్రసన్నకుమార్‌పై చీటింగ్‌తో పాటు దొంగతనం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డ్రక్స్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు మీవారే! -
'అద్దె'రిపోయే స్కెచ్...
డబ్బు సులువుగా సంపాదించడంలో అతడు ఘనాపాటి. రూపాయి పెట్టుబడి లేకుండా ఎదురువారి బలహీనతను పెట్టుబడిగా చేసుకుని ఎంజాయ్ చేసే జల్సా రాయుడు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ పేరిట చక్రం తిప్పిన అతడు ఏడాదిగా లక్షలు విలువైన కార్ల యజమానులను బురిడీ కొట్టిస్తూ వస్తున్నాడు. విలువైన కార్లను బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నెలకు అద్దె ఎర చూపి ఆ తరువాత అద్దె ఇవ్వకుండా మనిషి కనిపించకుండా ముఖం చాటేసే ఆ ప్రబుద్ధుడు ఎట్టకేలకు ఓ బాధితురాలి ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు. సాక్షి, కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట కూరగాయల మార్కెట్ ఎదురుగా నివాసం ఉండే మండవల్లి వెంకట సత్య కృష్ణ మోహన్‌ను సర్పవరం పోలీసులు ఆదివారం ఛీటింగ్ కేసులో అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో సీఐ గోవిందరాజు మీడియా సమావేశంలో నిందితుడు చేసిన మోసాన్ని వివరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన కార్ల యజమానులకు అద్దె ఎర చూపి వారి కార్లను తీసుకుని ఇతరులకు అద్దెకు లేదా సొమ్ములు తీసుకుని తనఖా పెడుతూ నాగ వెంకట సత్య కృష్ణమోహన్ ఏడాదిగా వ్యాపారం సాగిస్తున్నాడు. ఆ విధంగా సుమారు 30 కార్ల వరకు అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుని వివరాలు వెల్లడిస్తున్న సర్పవరం సీఐ గోవిందరాజు మొదట్లో అద్దె చెల్లించి తరువాత కనిపించకుండా ముఖం చాటేయడంతో కృష్ణమోహన్‌పై అనుమానం వచ్చిన సామర్లకోట మండలం పనసపాడుకు చెందిన ఓ కారు యజమాని తోట పద్మజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో చాలా కార్ల యజమానులు తమ కార్లకు అద్దె చెల్లించడం లేదని, కార్లు చేతులు మారాయని పోలీసులకు తెలిపారు. కృష్ణమోహన్ అద్దెకు తీసుకున్న కార్లలో సుమారు రూ.1.50 కోట్ల విలువైన 14 కార్లను ఎస్సై కృష్ణబాబు, సిబ్బంది శనివారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. (కడపలో అంతరాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం) బాధితులకు సుమారు రూ.20 లక్షల వరకు అద్దె బకాయి పడినట్టు గుర్తించారు. కార్ల వివరాలు కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ, ఇన్చార్జి డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆదేశాలతో బాధితులు నష్టపోకుండా కేసు త్వరగా ఛేదించామని సీఐ తెలిపారు. ఇందుకు ఏఎస్సై నాగేశ్వరరావు, హెచ్‌సీ రామకృష్ణ, పీసీలు సతీష్, దుర్గాప్రసాద్, రూప్‌కుమార్‌లు సహకరించారన్నారు. -
నిండా ముంచిన ‘369 క్యాబ్స్’
తూర్పుగోదావరి, అనపర్తి: ఎక్కువ అద్దె రేటు ఆశచూపి పలువురి నించి కార్లను తీసుకున్న ‘369 క్యాబ్స్’ నిర్వాహకులు వారిని నిండా ముంచారు. అద్దె చెల్లించక, వారి కార్లను ఇతర ప్రాంతాలకు తరలించి తనఖాలు పెట్టి వారిని నానా అవస్థలు పెట్టారు. విశాఖపట్నంలో ప్రారంభమైన ఈఅద్దె కార్ల బాగోతం అనపర్తికి చేరుకుంది. విశాఖపట్నానికి చెందిన ట్రావెల్ నిర్వాహకులు ఆదివారం అనపర్తి ప్రెస్ క్లబ్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అడపా ప్రసాద్, అతని మిత్రులు కుమార్, కిషోర్, రాము తదితరులు 2018 జనవరిలో విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టార్–2లో ‘369 క్యాబ్స్’ పేరుతో కార్యాలయం ప్రారంభించి అద్దె ప్రాతిపదికన కార్లు సరఫరా చేస్తామన్నారు. విశాఖ వ్యాప్తంగా ప్రతీ నెల అద్దె చెల్లించే విధంగా వారు కార్లను లీజుకు తీసుకున్నారని మురళీప్రియ ట్రావెల్స్ అధినేత ఎన్.వెంకటేష్ తెలిపారు. అలా తమ వద్ద అద్దెకు తీసుకున్న కార్లను రియల్ఎస్టేట్, ఎంఎన్సీ కంపెనీలు, సంస్థలకు సరఫరా చేసి నెలవారీ అద్దెలు క్రమబద్ధంగా చెల్లిస్తామని నమ్మబలికారని తెలిపారు. ఎక్కువ అద్దెలు చెల్లిస్తామని ఆశచూపారని తెలిపారు. దాంతో పలువురు బ్యాంకు రుణాలు తీసుకొని మరీ కార్లు కొనుగోలు చేసి వారికి అప్పగించారన్నారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యవర్తుల సహాయంతో సుమారు 400 కార్లకుపైగా ‘369 క్యాబ్’ ప్రతినిధులు సేకరించారన్నారు. వారు రెండు నెలల పాటు సక్రమంగానే కారు అద్దెలు చెల్లించి ఆతర్వాత చెల్లించలేదని, కార్ల కోసం సంప్రదించినా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. దాంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ‘369 క్యాబ్స్’ అద్దెకు తీసుకున్న కార్లు అనపర్తి, పరిసర గ్రామాల్లోనే తిరుగుతున్నాయని తెలియడంతో ఆయా గ్రామాలకు వచ్చి విచారించగా ట్రావెల్స్, కార్ల యజమానుల నుంచి అద్దెకు తీసుకున్న కార్లను అడపా ప్రసాద్, తదితరులు ఇతరులకు తాకట్టుపెట్టినట్టు తెలిసిందన్నారు. దీనిపై అడపా ప్రసాద్‌ను తాము ప్రశ్నించగా తప్పుడు కేసులు బనాయించి తమను జైల్లో పెట్టించారని ‘ఓపెల్ క్యాబ్స్’ నిర్వాహకుడు ఎల్.గణపతి వాపోయారు. ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేయగా మిగిలిన కార్లను రికవరీ చేయాల్సి ఉందన్నారు. తమ ట్రావెల్స్ ద్వారా, బయట వ్యక్తుల నుంచి తాము హామీ ఉండి తీసుకున్న కార్లకు నెలవారీ అద్దెలు చెల్లించక, బ్యాంకు వాయిదాలు బకాయి పడడంతో వారి నుండి ఒత్తిళ్లు అధికమవుతున్నాయని తెలిపారు. దీంతో భార్య, బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడటం తప్ప వేరే మార్గం కనబడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు, ఫైనాన్సర్లు స్పందించి తమ కార్లను తమకు అప్పగించాలని వారు విజ్ఞప్తి చేశారు. కారు యాజమానులు, క్యాబ్స్ నిర్వాహకులు పి.సురేష్, పి.వంశీ, ప్రసాద్ పాల్గొన్నారు. -
కార్లు అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు
నాంపల్లి: కార్లు అద్దెకు తీసుకుని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును నాంపల్లి పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యుల ముఠాలో ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. నాంపల్లి ఏ బ్యాటరీ లేన్‌కు చెందిన మహ్మద్ అఫ్జల్, మహ్మద్ ఇద్రీస్ ఖలీమ్, సయ్యద్ ఇమ్రాన్ స్నేహితులు. జల్సాలకు అలవాటుపడిన వీరు మోసాలకు తెరలేపారు. ఇందులో భాగంగా కార్లను అద్దెకు తీసుకుని అవి తమవేనంటూ నమ్మించి ఇతరులకు విక్రయిస్తున్నారు. కార్వాన్ సబ్సిమండికి చెందిన మహ్మద్ ఖలీమ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నాంపల్లి పోలీసులు ఆధారాలు సేకరించారు. మహ్మద్ అఫ్జల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహ్మద్ ఇద్రీస్ ఖలీమ్, సయ్యద్ ఇమ్రాన్‌ల కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో అడిషనల్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎస్సైలు సైదా, ప్రమోద్ రెడ్డి, పెంటయ్య గౌడ్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
విస్తరణ బాటలో డ్రివెన్..
♦ దేశంలో సెల్ఫ్ డ్రైవ్ పరిశ్రమ వృద్ధి ♦ మూడేళ్లలో 14 నగరాలకు విస్తరణ ♦ 5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా అద్దెకు కార్లు, బైకులనందిస్తున్న డ్రివెన్ స్టార్టప్.. విస్తరణ బాట పట్టింది. 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 8 నెలల క్రితం తన సేవలను ప్రారంభించిన డ్రివెన్ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో సేవలందిస్తుంది. సెల్ఫ్ డ్రైవ్ పరిశ్రమ వృద్ధి చెందుతుందని అందుకే మూడేళ్ల విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేశామని డ్రివెన్ కో-ఫౌండర్లు అశ్విన్ జైన్, కర్రర్ తాహెర్ చెప్పారు. బుధవారమిక్కడ డ్రివెన్ కెఫెను ప్రారంభించిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతానికి 160 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు, 7 బై సైకిళ్ల ద్వారా శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటి పలు ప్రాంతాల్లో ఔట్లెట్ల ద్వారా సేవలందిస్తున్నాం. మూడేళ్లలో 3 వేల కార్లు, 15 వేల ద్విచక్ర వాహనాలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని’’ చెప్పారు. రెండు విడతలో దేశంలోని 14 నగరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలి విడతగా చెన్నై, గోవా, ఢిల్లీ, ముంబై, పుణె, చంఢీఘర్, జైపూర్, ఉదయ్‌పూర్ నగరాలకు, ఆతర్వాత కోల్కత్తా, భువనేశ్వర్, నాగ్‌పూర్, లక్నో, షిమ్లా ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రతీ నగరంలోనూ 30-50 వాహనాలతో సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. విస్తరణ నిమిత్తం 5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టామని.. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు కూడా జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్లు ఎస్ఎం జైన్, నబీల్ హుస్సేన్, మితీన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.