సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. కార్లను అద్దెకు తీసుకొని బహిరంగ మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా ట్రావెల్ ఏజెన్సీ, ఓనర్ల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటుంది. ఆ తర్వాత సబ్సిడీ కార్ల పేరుతో అద్దెకు తీసుకున్న కార్లను బహిరంగ మార్కెట్లో అమ్ముతారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలో కార్లు వస్తున్నాయంటూ నమ్మబలికి.. జనాలను మోసం చేస్తారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులు హైదరాబాదులో పలు సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకున్నారు.
ఈ ముఠా మోసం వెలుగులోకి రావడంతో వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబరాబాద్ పోలీసులు సోమవాంర ఈ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 50 అత్యంత ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సబ్సిడీ కార్ల పేరుతోటి విక్రయాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కార్ల విలువ దాదాపుగా నాలుగున్నర కోట్లు రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. అద్దెకు తీసుకున్న కార్లకు రెండు మూడునెలల వరకు రెంట్ చెల్లించి ఆ తర్వాత మొహం చాటేయెడం వీరికి అలవాటని తెలిపారు పోలీసులు. ముఠాకు చెందిన పల్లె నరేష్ , బడావత్ రాజునాయక్, కలుముల వికాస్, గొల్లె భరత్ జోషిబానూరి ఎలక్షన్ రెడ్డి, తాళ్ల నర్స్మింహా రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment