ట్రిపుల్‌ ఐటీ విద్యార్థికి ఆర్థికసాయం | financial support to triple it student | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థికి ఆర్థికసాయం

Published Sat, Aug 6 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థికి ఆర్థికసాయం

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థికి ఆర్థికసాయం

హిందూపురం అర్బన్‌ : విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్‌ అన్నారు. హైదరాబాద్‌ బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో సీటు సాధించి ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినికి ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు.


లేపాక్షి మండలం నాయనపల్లికి చెందిన కృష్ణారెడ్డి కుమార్తె కీర్తిరెడ్డి ట్రిపుల్‌æఐటీ ప్రవేశానికి ఫీజు రూ.15 వేలు చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తాన్ని రెడ్డి సంక్షేమం అందజేసింది. కార్యక్రమంలో సప్తగిరి కళాశాల ప్రిన్సిపల్‌ ఈశ్వర్‌రెడ్డి, సభ్యులు అనిల్‌కుమార్‌రెడ్డి, మదన్‌గోపాల్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement