reddy welfare society
-
‘రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి’
హైదరాబాద్: తెలంగాణలో పేద రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయా లని డిమాండ్ చేస్తూ తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం సచివాలయం ముట్టడి చేపట్టారు. తమ సమస్యల్ని పరిష్కరించా లని 2015 నుంచి సభలు, సమావేశాలు, పాద యాత్రలు వంటి అనేక రూపాల్లో తమ గళాన్ని విన్పిస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక సహాధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రెడ్డి’ జాతీయ మహిళా కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: రెడ్డి సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ కమిటీని ఆదివారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్యాలయంలో జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం అధ్య క్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లాకు చెందిన వి.విరాణిరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జి.జ్యోతిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా జూలకంటి వరలక్ష్మిరెడ్డి (హైదరాబాద్), కె.నిరుపమారెడ్డి (మహబూబ్‌నగర్), జి.పవనకుమారి (చిత్తూరు)ని నియమించారు. ఈ సందర్భంగా విరాణిరెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరుపేద రెడ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రెడ్ల అభివృద్ధి ఐక్యతే ధ్యేయంగా త్వరలో దేశ రాజధానిలో వేలాది మందితో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. దేశంలోని మూడు కోట్ల మందికి పైగా ఉన్న రెడ్ల సమస్యలపై ప్రధాన నగరాల్లో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థికి ఆర్థికసాయం
హిందూపురం అర్బన్ : విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు. హైదరాబాద్ బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సాధించి ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినికి ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు. లేపాక్షి మండలం నాయనపల్లికి చెందిన కృష్ణారెడ్డి కుమార్తె కీర్తిరెడ్డి ట్రిపుల్æఐటీ ప్రవేశానికి ఫీజు రూ.15 వేలు చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తాన్ని రెడ్డి సంక్షేమం అందజేసింది. కార్యక్రమంలో సప్తగిరి కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వర్‌రెడ్డి, సభ్యులు అనిల్‌కుమార్‌రెడ్డి, మదన్‌గోపాల్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.