
హైదరాబాద్: రెడ్డి సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ కమిటీని ఆదివారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్యాలయంలో జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం అధ్య క్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లాకు చెందిన వి.విరాణిరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జి.జ్యోతిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా జూలకంటి వరలక్ష్మిరెడ్డి (హైదరాబాద్), కె.నిరుపమారెడ్డి (మహబూబ్‌నగర్), జి.పవనకుమారి (చిత్తూరు)ని నియమించారు.
ఈ సందర్భంగా విరాణిరెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరుపేద రెడ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రెడ్ల అభివృద్ధి ఐక్యతే ధ్యేయంగా త్వరలో దేశ రాజధానిలో వేలాది మందితో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. దేశంలోని మూడు కోట్ల మందికి పైగా ఉన్న రెడ్ల సమస్యలపై ప్రధాన నగరాల్లో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment