ఏపీలో జగన్‌ విజయం తథ్యం | OC National Welfare Association President Fire On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఏపీలో జగన్‌ విజయం తథ్యం

Published Fri, May 17 2019 11:08 AM | Last Updated on Fri, May 17 2019 11:08 AM

OC National Welfare Association  President Fire On Chandrababu Naidu - Sakshi

జి.కరుణాకర్‌రెడ్డి

శివాజీనగర: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఓ.సీ.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.  ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికల కమిషన్‌పైనా, ఐఏఎస్‌లపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని తేలడంతో ఈవీయంలపై ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల తరువాత చంద్రబాబును ఏ ఒక్క జాతీయ పార్టీ నాయకుడు కూడా పట్టించుకోరనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందుగానే ఈవీయంల పేరుతో జాతీయస్థాయిలో కుట్రలకు పాల్పడుతూ రాష్ట్ర పరువును బజారుకీడ్చుతున్నాడని విమర్శించారు. డబ్బు, అధికార దుర్వినియోగం, హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని, అయినా అధికారంలోకి వస్తామని చంద్రాబు కోతలు కోస్తూ మభ్యపెడుతున్నాడని తెలిపారు. ఐదేళ్ల నుంచి చంద్రబాబు అక్రమంగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు మరో ఐదు కట్టవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

అగ్రవర్ణ పేదలు మోదీ వైపు  
అగ్రవర్ణ పేదలకు పది శాతం విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడంతో నరేంద్రమోదీ కేంద్రంలో మరొకసారి ప్రధాని అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. అగ్రవర్ణాలతో పాటు ఇతర వర్గాలు కూడా మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకొంటున్నారని చెప్పారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకై ఉద్యమిస్తున్న వివిధ రాష్ట్రాలలోని సంఘాలతో కలసి గత పది రోజులుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్‌ తదితర రాష్ట్రాలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement