karunakar reddy
-
తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల: తిరుమల తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఆహారం, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందుతున్నాయా లేదా..? అని గ్యాలరీల్లోని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కాసేపు ముచ్చటించారు. గ్యాలరీలో వేచి ఉండే ప్రతి భక్తుడికి గరుడ వాహనంపై ఉన్న మలప్ప స్వామి వారి దర్శనం చేయిస్తామని ఈ సందర్భంగా ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అన్నారు. గ్యాలరీల్లో లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నప్పటికీ వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 'నేను చాలామందితో మాట్లాడాను. అందరు కూడా టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు' అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాారు. ఇదీ చదవండి: ‘చంద్రయాన్–3’ ఓ అద్భుతం -
గూడు కట్టిన ‘కరుణ’
బంజారాహిల్స్: పేదింటికి పెన్నిధిలా మారారు ఆయన. తనకొచ్చిన కష్టాన్ని వివరించేందుకు వచ్చిన దీనురాలికి సాయం అందించి తోడుగా నిలిచారు ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి. వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 10లో నివసించే 70 ఏళ్ల ఉన్నిసా బేగం భర్త మూడు దశాబ్దాల క్రితం మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలయ్యాయి. తాను ఉంటున్న ఇంటిని ఉన్నిసా బేగం దాచుకున్న డబ్బుతో గత ఏడాది బాగు చేయించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇల్లు ఉరుస్తుండటంతో.. మేస్త్రి సరిగా రిపేరు చేయలేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వృద్ధురాలి బాధను విన్న ఎస్ఐ కరుణాకర్ రెడ్డి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంటికి అవసరమైన కొత్త సిమెంట్ రేకులను తన సొంత డబ్బుతో అందించారు. ఎస్ఐ ఔదార్యాన్ని స్థానికులు అభినందించారు. -
కరోనా కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితి, గత కొన్ని రోజులుగా కేసుల పెరుగుదలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఆరాతీశారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ), కరోనా రాష్ట్ర నిపుణుల కమిటీ సభ్యుడు బి.కరుణాకర్‌రెడ్డిని రాజ్‌భవన్‌కు పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పెరుగుదల ప్రధానంగా పుట్టిన రోజు వంటి పార్టీల వల్లనేనని, చాలా కేసులు ఒకే కుటుంబం నుంచి లేదా వలస వచ్చిన కార్మికుల నుంచి వచ్చినవేనని కరుణాకర్‌రెడ్డి వివరించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కఠినంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరిస్థితి నియంత్రణలో ఉందని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని గవర్నర్‌కు ఆయన వివరించారు. అలాగే పీజీ మెడికల్ ప్రవేశాలు, విద్యార్థుల నుంచి ఫీజులకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపైనా వీసీని గవర్నర్ వివరణ కోరారు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. పీజీ మెడికల్ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి మరికొంత సమయం ఇస్తామని చెప్పారు. -
ఏపీలో జగన్ విజయం తథ్యం
శివాజీనగర: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఓ.సీ.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికల కమిషన్‌పైనా, ఐఏఎస్‌లపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ విజయం తథ్యమని తేలడంతో ఈవీయంలపై ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల తరువాత చంద్రబాబును ఏ ఒక్క జాతీయ పార్టీ నాయకుడు కూడా పట్టించుకోరనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందుగానే ఈవీయంల పేరుతో జాతీయస్థాయిలో కుట్రలకు పాల్పడుతూ రాష్ట్ర పరువును బజారుకీడ్చుతున్నాడని విమర్శించారు. డబ్బు, అధికార దుర్వినియోగం, హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని, అయినా అధికారంలోకి వస్తామని చంద్రాబు కోతలు కోస్తూ మభ్యపెడుతున్నాడని తెలిపారు. ఐదేళ్ల నుంచి చంద్రబాబు అక్రమంగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు మరో ఐదు కట్టవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అగ్రవర్ణ పేదలు మోదీ వైపు అగ్రవర్ణ పేదలకు పది శాతం విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడంతో నరేంద్రమోదీ కేంద్రంలో మరొకసారి ప్రధాని అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. అగ్రవర్ణాలతో పాటు ఇతర వర్గాలు కూడా మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకొంటున్నారని చెప్పారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకై ఉద్యమిస్తున్న వివిధ రాష్ట్రాలలోని సంఘాలతో కలసి గత పది రోజులుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. -
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి’
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలకు తక్షణమే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి కోరారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగ నియామకాల్లో కూడా నిరుపేద ఓసీలకు రిజర్వేషన్లు వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఏపీలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు.. మిగతా 5 శాతం రిజర్వేషన్లను అగ్రవర్ణంలోని పేదలకు ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రకటించారని పేర్కొన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనలతో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని మండిపడ్డారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అమలు కోసం త్వరలో లక్నో, జైపూర్, బెంగళూరు, భోపాల్‌లలో జాతీయ చైతన్య సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు డి.సుదర్శనరెడ్డి, నాగిరెడ్డి, నరసింహారెడ్డి, సూర్యకుమార్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అగ్రవర్ణాల ఆత్మరక్షణకు చట్టం తేవాలి’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనల పునరుద్ధరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో అగ్రవర్ణాల ఆత్మరక్షణకూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్రవర్ణాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసుల నుంచి కాపాడుకునేందుకు అగ్రవర్ణాల ఆత్మరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించి పార్లమెంటులో ఆమోదించాలని కోరారు. కులం అనేది సామాజిక హోదాగా పరిగణించబడుతున్న నేపథ్యంలో కులం పేరుతో ఏ వర్గాన్ని దూషించినా నేరంగా పరిగణించేలా చట్టాన్ని సవరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగమవుతోందని భావించిన అత్యున్నత న్యాయస్థానం చట్టంలో మార్పులు చేసిందని పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీలు, సంఘాల ఒత్తిడికి తలొగ్గి పాత నిబంధనలను పునరుద్ధరించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం సరైంది కాదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దళితులు, అగ్రవర్ణాల మధ్య ఐక్యతను పెంపొందించకుండా కేవలం వారి మధ్య అగాధం సృష్టించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓసీల సమస్యలను పార్లమెంటులో చర్చించాలి
సాక్షి, హైదరాబాద్: నిరుపేద ఓసీల సమస్యలను ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుపేద ఓసీల సమస్యలను పార్లమెంటులో చర్చించాలని కోరుతూ వచ్చే వారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులను కలసి వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. దేశంలో ఉన్న నిరుపేద ఓసీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లతో జాతీయ ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మందికి పైగా ఉన్న నిరుపేద ఓసీలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న మేజర్ జనరల్ సిన్హా నివేదికను తక్షణమే పార్లమెంటులో చర్చించి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించి ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన అగ్రవర్ణపేదలకు విద్య, ఉద్యోగ, రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఆర్థిక ప్యాకేజీ అంశాన్ని దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రధాన ఎజెండాగా పరిగణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
‘రెడ్డి’ జాతీయ మహిళా కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: రెడ్డి సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ కమిటీని ఆదివారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్యాలయంలో జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం అధ్య క్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లాకు చెందిన వి.విరాణిరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జి.జ్యోతిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా జూలకంటి వరలక్ష్మిరెడ్డి (హైదరాబాద్), కె.నిరుపమారెడ్డి (మహబూబ్‌నగర్), జి.పవనకుమారి (చిత్తూరు)ని నియమించారు. ఈ సందర్భంగా విరాణిరెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరుపేద రెడ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రెడ్ల అభివృద్ధి ఐక్యతే ధ్యేయంగా త్వరలో దేశ రాజధానిలో వేలాది మందితో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. దేశంలోని మూడు కోట్ల మందికి పైగా ఉన్న రెడ్ల సమస్యలపై ప్రధాన నగరాల్లో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. -
రాజ్యసభ అభ్యర్థుల్లో రెడ్లకు మొండిచేయి
హైదరాబాద్: రెడ్డి సామాజికవర్గాన్ని అన్ని రంగాల్లో అణి చివేసేందుకు తెలు గు రాష్ట్రాల సీఎంలు ప్రయత్నిస్తున్నారని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి మండిపడ్డా రు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సమర్థులైన రెడ్డి అభ్యర్థులున్నా పరిశీలించకుండా మొండిచేయి చూపడం శోచనీయమన్నారు. ఏపీలో నలుగురు రెడ్డి సామాజికవర్గ మంత్రులు రాజ్యసభ అభ్యర్థిగా తమ వర్గానికి చెందినవారిని ఎంపిక చేయాలని కోరినా చంద్రబాబు పట్టించుకోకపోవడం ఆయన నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. రెడ్డి వర్గానికి చెందిన వారిని వాడుకొని.. తర్వాత వారిని కరివేపాకులా తీసిపారేయడం చంద్రబాబు, కేసీఆర్‌లకు అలవాటేనన్నారు. -
కృష్ణకు ‘ఆట’ పురస్కారం
సూపర్‌స్టార్ కృష్ణకు ‘ఆట’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) జీవన సాఫల్య పురస్కారం అందించనుంది. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు ‘ఆట’ సంస్థ ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ప్రతి రెండేళ్లకు ఇండియా వచ్చి ‘ఆట వేడుకలు’ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే ఈ సంస్థ ఈ ఏడాది పలు అంశాలపై అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 26న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 23న ముగియనున్నాయి. ముగింపు రోజున కృష్ణకు ‘ఆట జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నామని ‘ఆట’ ప్రస్తుత అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, కాబోయే అధ్యక్షుడు (ప్రెసిడెంట్ ఎలెక్ట్) పరమేష్ భీమిరెడ్డి తెలిపారు. ఆట చేపట్టబోయే కార్యక్రమాలను ‘ఆట’ గౌరవ సలహాదారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ‘ఆట’ ఓవర్సీస్ కో–ఆర్డినేటర్స్ లోహిత్, మధుసూధన్ కోడూరు, ‘ఆట’ ఫౌండర్ మెంబర్ డాక్టర్ రంగారావు, బోర్డు మెంబర్స్ అనిల్ బొద్దిరెడ్డి, భువనేశ్ బూజాల, డాక్టర్ సురేంద్రరెడ్డి తదితరులు పత్రికాముఖంగా వివరించారు. -
రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి
- జాతీయ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి - త్వరలో పలు నగరాల్లో రెడ్డి మినీ గర్జన సభలు హైదరాబాద్: నిరుపేద రెడ్డి సామాజిక అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్లతో జాతీయ స్థాయిలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు జి. కరుణాకర్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదివారం రెడ్డి సంఘం ప్రతినిధులతో కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజాప్రతినిధుల మద్దతు లేకుండా రెడ్డి మహాగర్జన నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, విశాఖపట్నం, కర్నూలు తదితర నగరాలలో త్వరలో రెడ్డి మినీ గర్జనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుపేద రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం తక్షణమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే రెడ్డి పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల సహకారంతో తామే రూ.2 వేల కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. అధిక శాతం రెడ్డి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ వర్గానికి చెందిన సమస్యలపై ఏనాడూ పెదవి విప్పి మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. రిజర్వేషన్ల పెంపు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో బీరం ఇందిరారెడ్డి, పటోళ్ళ నాగిరెడ్డి, ఎస్.కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
30న హైదరాబాద్‌లో ‘జాతీయ రెడ్డి గర్జన’
జాతీయ రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడి నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రెడ్ల అభివృద్ధి, ఐక్యతే ధ్యేయంగా ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ‘జాతీయ రెడ్డి మహాగర్జన’ నిర్వహించనున్నట్టు ఆ వేదిక జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గుంటూరులోని ట్రావెల్స్ బంగ్లాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుం చి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది మంత్రులను, 16 మంది పార్లమెంటు సభ్యు లు, 108 మంది శాసనసభ్యులకు, అలాగే 46 మంది ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేషన్ చైర్మన్లను, జెడ్పీ చైర్మన్లను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రెడ్లలో అత్యధిక శాతం మంది కడు పేదరికంతో దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని వీరిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గత 65 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు లేక రెడ్లు ఉద్యోగ అవకాశాలకు దూరమ య్యారని 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కరుణా కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెడ్డి మహాగర్జన సందర్భంగా పేద విద్యార్థుల సంక్షేమానికి, ఉన్నత విద్య కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగా సినిమాల్లో రెడ్లను అసభ్యకరంగా, దుర్మార్గులుగా, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని, ఇలాంటి చర్యలను నియంత్రించాలని ఆయన కోరారు. సభ నిర్వహణకు చంద్రబాబు అడ్డుపుల్లలు: జాతీయ రెడ్డి మహాగర్జనను తొలుత అమరావతిలోని గుంటూరులో నిర్వహించాలని నిర్ణయించామని కరుణాకరరెడ్డి తెలిపారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీకి చెందిన నేతల ద్వారా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘భూమా మృతికి చంద్రబాబే కారణం’
హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మరణానికి ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భూమాపై అక్రమ కేసులు బనాయించి ఆర్థికంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, ఆ కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేసి టీడీపీలో చేర్చుకుని అవమానాలపాలు చేశారన్నారు. మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆయన మృతికి కారణమయ్యారన్నారు. ఎస్సీ,ఎస్టీ, ఎర్రచందనం కేసులు బనాయించిన చంద్రబాబుకు భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించే అర్హత లేదన్నారు. -
తెలంగాణలో వైద్య విద్యకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య సీట్లకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ కరుణాకరరెడ్డి తెలిపారు. -
అప్పు..ఇద్దరి ప్రాణాలు తీసింది
దౌల్తాబాద్: మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పు విషయంపై తలెత్తిన వివాదం రెండు కుటుంబాల్లో పెద్ద దిక్కు లేకుండా చేసింది. ఈ సంఘటన జిల్లాలో దౌల్తాబాద్ దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద యాదగిరి అనే రైతు కొంతమొత్తం అప్పు తీసుకున్నాడు. ఆ రుణం తీర్చలేకపోవటంతో శుక్రవారం ఉదయం కరుణాకర్ రెడ్డి.. యాదగిరికి చెందిన రెండు కాడెడ్లను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన యాదగిరి పొలంలో పురుగు మందు తాగి మృతిపోయాడు. యాదగిరి మృతితో ఆగ్రహించిన అతని కుటుంబీకులు కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టారు. అందుకు మనస్తాపం చెందిన కరుణాకర్‌రెడ్డి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి
ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కోసం సత్వరమే రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఫరీదాబాద్‌లో ‘ఆలిండియా యాంటీ రిజర్వేషన్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక వివక్షత అంతరించి అర్థిక వివక్షత కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కల్కనూరు గ్రామ సర్పంచ్ ముత్తమ్మ (70) శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎంపీపీ కరుణాకర్‌రెడ్డి ఆదివారం ముత్తమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
సాయం చేస్తే.. ప్రాణం పోయింది
అప్పు తీసుకున్న వ్యక్తి కాల్‌మనీ కేసు పెడతామని బెదిరింపు మనోవేదనకుగురై గుండెపోటుతో మరణించిన అప్పు ఇచ్చిన వ్యక్తి తన భర్త మృతికి అప్పు తీసుకున్న వ్యక్తే కారణమని భార్య ఫిర్యాదు తిరుపతి: వ్యాపారం చేస్తాను అని మిత్రుడు కోరగా.. ఆ మిత్రుడికి అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణాలే కోల్పోయాడు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పాల వ్యాపారి. అప్పు తిరిగి చెల్లించమని కోరితే.. 'ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించవద్దన్నాడు. ఎక్కువ మాట్లాడితే కాల్‌మనీ కేసు పెడతాను' అని అప్పు తీసుకున్న వ్యక్తి బెదిరించడంతో గుండెపోటుతో మరణించాడు పాల వ్యాపారి సుబ్రహ్మణ్యం యాదవ్. దీనిపై సుబ్రహ్మణ్యం భార్య సోమవారం ముత్యాలరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పు తీసుకున్న కరుణాకర్‌రెడ్డి బెదిరించడంతో తన భర్త గుండెపోటుతో చనిపోయాడని తిరుపతి రూరల్ మండలం మల్లంగుంటకు చెందిన నిర్మల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మల్లంగుంటకు చెందిన పొట్టేలు సుబ్రహ్మణ్యంయాదవ్ పాల వ్యాపారం చేస్తుండేవాడు. సి.గొల్లపల్లికి చెందిన కరుణాకర్‌రెడ్డి పాల వ్యాపారం చేస్తామని కొంతకాలం క్రితం మల్లంగుంటలో సుబ్రహ్మణ్యంయాదవ్కు చెందిన పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. అక్కడ డెయిరీ ప్రారంభించాడు. ఇద్దరికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంయాదవ్ తన బంధువులు, స్నేహితులు తీసుకున్న డబ్బుతో పాటు తన వద్ద ఉన్న డబ్బు కలిపి మొత్తం రూ.15.40 లక్షలను కరుణాకర్‌రెడ్డికి వడ్డీకి ఇచ్చాడు. మూడేళ్లయినా అతను తిరిగి చెల్లించలేదు. వడ్డీ కూడా ఇవ్వలేదు. ఒక పక్క బంధువులు ఒత్తిడి, మరో పక్క బిడ్డల చదువులకు ఫీజులు చెల్లించాల్సి ఉండడంతో సుబ్రహ్మణ్యం శనివారం గొల్లపల్లికి వెళ్లి కరుణాకర్‌రెడ్డిని డబ్బులు అడిగాడు. అప్పులు చెల్లించవద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, తాను ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. ఎక్కువగా మాట్లాడితే కాల్‌మనీ కేసు పెడతామని బెదిరించాడు. దీంతో సుబ్రహ్మణ్యంయాదవ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీసుకున్న డబ్బు చెల్లించకుండా తన భర్తను బెదిరించి ఆయన చావుకు కారణమైన కరుణాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నిర్మల పోలీసులను కోరారు. -
విజయవాడలో రాష్ట్ర ప్రధాన వాతావరణ కేంద్రం
రాష్ట్ర వాతావరణ శాఖ డెరైక్టర్ యెరెడ్ల కరుణాకర్‌రెడ్డి రెంటచింతలలో అత్యాధునిక వాతావరణ నమోదు కేంద్రం ప్రారంభం రెంటచింతల రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ డెరైక్టర్ యెరెడ్ల కరుణాకర్‌రెడ్డి చెప్పారు. రెంటచింతలలోని తేరేజమ్మ హాస్టల్ ఆవరణలో రూ.ఆరు లక్షలతో ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటుచేసిన వాతావరణ నమోదు కేంద్రాన్ని గురువారం ఫాదర్లు పుట్టి సుందరరాజు, గోవిందు బాలస్వామితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. త్వరలోనే గాలి దిశను తెలిపేయంత్రం ఏర్పాటు ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడాన్ని 1936లో గమనించిన బ్రిటీష్ వారు వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. గతేడాది మార్చిలో అనివార్య కారణాలతో గురజాలలోని జంగమహేశ్వరపురం వ్యవసాయ క్షేత్రానికి దానిని తరలించినట్లు తెలిపారు. స్థానిక రైతు గోగిరెడ్డి ప్రతాప్‌రెడ్డి చొరవతో ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రం ద్వారా గంటగంటకూ ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమశాతాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. త్వరలోనే ఇక్కడ గాలి దిశను తెలిపే యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతుల సెల్ ఫోన్లకు సమాచారం రైతులు పేరు, ఊరి పేరు, సెల్ నంబర్ నమోదుచేసుకుంటే ప్రతి మంగళవారం, శుక్రవారం వాతావరణ వివరాలు మెసేజ్ రూపంలో పంపిస్తామని తెలిపారు. రెంటచింతలలో 2003 మే 28న 49.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, 2004 ఫిబ్రవరి 8న 9.4 అత్యల్ప ఉష్ణోగ్రత, 1964 సెప్టెంబర్ 29న 227మి.మీల అత్యధిక వర్షపాతం నమోదైందని వివరించారు. ఇంజినీర్లు గజేంద్రసింగ్, సంజయ్, మాజీ సర్పంచ్ కటకం శౌరెడ్డి, కట్టమూరి నాగేశ్వరరావు,తుమ్మా లూర్దురెడ్డి,ఏరువప్రతాప్రెడ్డి,తుమ్మా ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రవాసులను ఆదర్శంగా తీసుకోవాలి
‘ఆటా’ ముగింపు వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, భాషావ్యాప్తిని ప్రవాస తెలుగువారు చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారని, ఇక్కడి వారు విదేశాల్లో ఉన్న మన తెలుగువాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా జన్మభూమికి సేవలందిస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమన్నారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శిల్పకళా వేదికలో ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆటా ఎలక్ట్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటా ముగింపు వేడుకలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెరికారి, సాంస్కృతిక కార్యక్రమాల సలహాదారు డాక్టర్ పద్మజారెడ్డి, ఆటా ఓవర్సీస్ సమన్వయకర్తలు పి.హరినాథ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఆటా కార్యదర్శి బొమ్మినేని మధు, ఎనుగు లక్ష్మారెడ్డి, పీ కిరణ్, శ్రీనివాస్, టీడీటీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆరోగ్య వర్సిటీ వీసీగా కరుణాకర్‌రెడ్డి
♦ ఎట్టకేలకు మొదలైన ప్రక్రియ... పోస్టుల భర్తీకి రంగం సిద్ధం ♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట వరంగల్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ బందె కరుణాకర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం శుక్రవారం సంతకం చేశారు. కరుణాకర్‌రెడ్డి ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఇక వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఈ వర్సిటీ పూర్తిస్థాయిలో పనిచేయనుంది. ఇప్పటివరకు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి జరుగుతోన్న కార్యకలాపాలన్నీ దీని కిందకు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు 4, ప్రైవేటు వైద్య కళాశాలలు 12 ఉన్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 11 డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోకి రానున్నాయి. వీసీ నియామకం జరిగాక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 80 పోస్టుల భర్తీకి సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీసీ ఆధ్వర్యంలో వాటి భర్తీ చేపడతారు. వరంగల్‌లో విశ్వవిద్యాల యానికి భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. -
రైతు ఆత్మహత్యలను చూస్తూ ఉండలేం
వాటిని అరికట్టే దిశగా చర్యలు ప్రారంభించాలి కనీస మద్దతు ధర నిర్ణయంలో వైఖరేంటో చెప్పండి కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలను చూస్తూ ఉండలేమని, వీటిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు తగిన చర్యలు ప్రారంభించాలని హైకోర్టు వెల్లడించింది. పెట్టుబడి వ్యయం ఆధారంగా పత్తితోపాటు మిగిలిన పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) నిర్ణయించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్టుబడి వ్యయాల ఆధారంగా కనీస మద్దతు ధరను నిర్ణయించకపోవడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, ప్రభుత్వం రూపొందించిన విధానానికి సైతం విరుద్ధమంటూ అదిలాబాద్ జిల్లా తాలమడుగు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కళ్లెం కరుణాకర్‌రెడ్డి హైకోర్టులో గతవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.సురేందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పెట్టుబడి ఖర్చు ఆధారంగా రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, దీనివల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను అరికట్టే దిశగా ప్రభుత్వాలు తగిన చర్యలు ప్రారంభించాలన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఆత్మగౌరవమే అటా నినాదం
సిటీబ్యూరో: తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ, అన్ని రంగాల్లో వారి అభ్యున్నతే లక్ష్యంగా అమెరికా తెలుగు అసోసియేషన్ పాతికేళ్ల క్రితం పురుడు పోసుకుందని అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు ఏసీరెడ్డి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పాతికేళ్ల ప్రస్థానంలో అటా తెలుగుభాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషిచేస్తోందని, వివిధ రంగాల్లో ప్రతిభగల కళాకారులకు చేయూతనందిస్తోందని తెలిపారు. జూలై 1, 2016 నుంచి అటా రజతోత్సవాలను అమెరికాలోని చికాగోలో వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. నగర పర్యటనలో ఉన్న ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మనోగతం ఇదిగో.. రజతోత్సవాలకు సన్నాహాలు.. అమెరికాలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న సంస్థ అమెరికా తెలుగు అసోషియేషన్(అటా). ఇది ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగువారి ఆత్మగౌరవ రక్షణ కోసం 1991లో ఏర్పడింది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నాం. 2016 జూలై 1 నుంచి ప్రారంభమై జూలై 3 వరకు చికాగో నగరంలో ఉత్సవాలు జరగనున్నాయి. వీటిని పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాం.అటా ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రతి రెండేళ్లకో మారు చొప్పున ఇప్పటి వరకు 11 సభలు జరుపుకుంది. వచ్చే ఏడాది జూలైలో జరిగే సభ 12వది. ఈ సందర్భంగా ‘అమెరికా భారతి’ పేరుతో ప్రత్యేక సంచికను విడుదల చేస్తున్నాం. ఇందులో తెలుగు భాష, సంస్కృతి, వారసత్వం, సాహిత్యం, సంప్రదాయాలు, విభిన్న రంగాల్లో లబ్దప్రతిష్టుల ఇంటర్వ్యూలు, మనోగతాలను ప్రచురించనున్నాం. సేవా కార్యక్రమాలకు 20 బృందాలు.. ఈ ఏడాది డిసెంబరులో డిసెంబర్ 3 నుంచి 20 వరకు 20 ఎన్ఆర్ఐ బృందాల సభ్యులు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. డిసెంబరు 19న ‘సేవ్ గర్ల్ చైల్డ్’ పేరుతో నెక్లెస్ రోడ్డులో 5కే రన్, 20న శిల్పకళావేదికలో సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇందులో ఒక్కో విభాగం నుంచి ముగ్గురిని ఎంపిక చేసి వారిని చికాగోలో జరిగే ఉత్సవాలకు తీసుకెళ్తాం. ఆసక్తి గల వారు ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.అటావరల్డ్.ఓఆర్‌జి’ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. విద్యార్థుల కోసం ఓ వెబ్సైట్ అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థులకు ప్రత్యేక గెడైన్స్ ఇచ్చేందుకు వెబ్‌సైట్‌ను అటా ప్రారంభించింది. విద్యార్థులెవరైనా ‘ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎట్‌దిరేట్ అటావరల్డ్.ఓఆర్‌జి వెబ్‌సైట్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. ఆయా అంశాల్లో అవగాహన కోసం డిసెంబరు 20న అమెరికాలోని ప్రతిష్టాత్మక కళాశాలల వివరాలను అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో రవీంద్ర భారతిలో సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. -
మేం కూడా గుజ్జర్లలాగా ఫైట్ చేస్తాం
నాంపల్లి: ఓసీల సమస్యలు పరిష్కరించకపోతే రాజస్థాన్‌లో గుజ్జర్ల తరహాలో ఉద్యమం చేపడతామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సంఘం తెలుగు రాష్ట్రాల కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల సాధనకు రాజ్యాంగ సవరణ చేసే విధంగా ఎంపీలపై ఒత్తిడి తెస్తామన్నారు. ఓసీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ ప్రకటించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. విద్యా, ఉద్యోగ, పదోన్నతులతోపాటు, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ప్రకటిస్తూ ఓసీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం సరికాదన్నారు. అగ్రవర్ణాల పేరుతో ఎందరో పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా నిరుపేద ఓసీల సమస్యల పరిష్కారం కోసం అనేక కమిటీలు వేసిన ప్రభుత్వాలు వాటని ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరుకోట్ల మంది అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓసీల అభివృద్థికి రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లుగానే జాతీయ ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. -
రకాలు వేరైనా దిగుబడి సమానమే
న్యాల్కల్: బీటీ పత్తి విత్తనాలు ఏవైనా ఒకే రకం దిగుబడులను ఇస్తాయని ఆత్మకమిటీ జిల్లా ఇన్చార్జ్ డీపీడీ కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆత్మ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మిర్జాపూర్(ఎన్)లో మంగళవారం బీటీ పత్తి రకాల వ్యత్యాసాలపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీటీ రకాలు వేరైనప్పటికీ దిగుబడులు మాత్రం ఒకే రకంగా వస్తాయని చెప్పారు. దీనిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో అధిక ధరలకు విత్తనాలు కొని నష్టపోతున్నారని తెలిపారు. వీరికి అవగాహన కల్పించేందుకు స్థానిక రైతు వామన్‌రావుకు చెందిన నాలుగు ఎకరాల పొలంలో ప్రయోగాత్మకంగా మల్లికగోల్డ్, భాస్కర్, వర్మ, జాదు అనే నాలుగు రకాల బీటీ పత్తి విత్తనాలను ఎకరం చొప్పన నాలుగు ఎకరాల్లో సాగు చేశామని చెప్పారు. అన్ని రకాల పంటలకు సమాన పరిమాణంలో ఎరువులు, నీరు అందిస్తున్నామన్నారు. మొక్కల ఎదుగుదలలో మార్పు అన్నింటిలోనూ ఒకే రకంగా ఉందని తెలిపారు. దిగుబడులు కూడా ఒకే రకంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. లేత కాండంపై బొట్టు పెట్టే కార్యక్రమం పలుమార్లు నిర్వహించామన్నారు. దీంతో రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. అంతే కాకుండా పొలంలో అక్కడక్కడ జిగురుతో ఉండే పసుపు రంగు ప్లేట్లను పెట్టాలన్నారు. పంటకు నష్టం చేసే పురుగులు దీనికి అతుక్కుని చనిపోతాయని వివరించారు. ఈ విధానం ద్వారా రైతులకు అధిక దిగుబడులు రావడమే కాకుండా 50 శాతం మేర ఖర్చు తగ్గుతుందని చెప్పారు. రసాయన మందులను అధికంగా వాడొద్దని సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి లావణ్య రైతులు పాల్గొన్నారు.