
‘భూమా మృతికి చంద్రబాబే కారణం’
నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మరణానికి ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు
మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆయన మృతికి కారణమయ్యారన్నారు. ఎస్సీ,ఎస్టీ, ఎర్రచందనం కేసులు బనాయించిన చంద్రబాబుకు భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించే అర్హత లేదన్నారు.