
హైదరాబాద్: రెడ్డి సామాజికవర్గాన్ని అన్ని రంగాల్లో అణి చివేసేందుకు తెలు గు రాష్ట్రాల సీఎంలు ప్రయత్నిస్తున్నారని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి మండిపడ్డా రు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సమర్థులైన రెడ్డి అభ్యర్థులున్నా పరిశీలించకుండా మొండిచేయి చూపడం శోచనీయమన్నారు.
ఏపీలో నలుగురు రెడ్డి సామాజికవర్గ మంత్రులు రాజ్యసభ అభ్యర్థిగా తమ వర్గానికి చెందినవారిని ఎంపిక చేయాలని కోరినా చంద్రబాబు పట్టించుకోకపోవడం ఆయన నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. రెడ్డి వర్గానికి చెందిన వారిని వాడుకొని.. తర్వాత వారిని కరివేపాకులా తీసిపారేయడం చంద్రబాబు, కేసీఆర్‌లకు అలవాటేనన్నారు.