తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు | TTD Chairman Inspects The Streets Of Tirumala | Sakshi
Sakshi News home page

తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు

Sep 22 2023 4:38 PM | Updated on Sep 22 2023 8:42 PM

TTD Chairman Inspects The Streets Of Tirumala - Sakshi

తిరుమల: తిరుమల తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఆహారం, పాలు, కాఫీ, టీ, తాగునీరు  అందుతున్నాయా లేదా..? అని గ్యాలరీల్లోని  భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కాసేపు ముచ్చటించారు.  

గ్యాలరీలో వేచి ఉండే ప్రతి భక్తుడికి గరుడ వాహనంపై ఉన్న మలప్ప స్వామి వారి దర్శనం చేయిస్తామని ఈ సందర్భంగా ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అన్నారు. గ్యాలరీల్లో లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నప్పటికీ వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

'నేను చాలామందితో మాట్లాడాను. అందరు కూడా టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు‌. అధికారులు భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు' అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాారు. 

ఇదీ చదవండి: ‘చంద్రయాన్‌–3’ ఓ అద్భుతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement