inspect
-
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా లక్ష మంది పేదలకు రిఫరల్ సేవలు
సాక్షి, గుంటూరు జిల్లా: జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ఇప్పటి వరకు 55 లక్షల మంది ఓపీకి రాగా.. వీరిలో దాదాపు లక్ష మందికి ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యానికి డాక్టర్లు రిఫరల్‌కు పంపించారని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. కేవలం రిఫరల్‌తో ఆగిపోకుండా చికిత్స అనంతరం తిరిగి గ్రామాలకొచ్చాక కూడా ఆయా పేషంట్ లు ఏమేరకు సంతృప్తి పొందారో ఫీడ్ బ్యాక్ తీసుకుని, బాగుందని సంతృప్తి చెందే వరకు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారని తెలిపారు. ఆ దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయాల్లో మార్కండేయ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఆరోగ్య శ్రీ సీఈవో ఎం.యన్.హరీందర ప్రసాద్, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణ్ బాబు పాల్గొన్నారు. గతంలో ఒక యుపిహెచ్సీ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించాలనుకున్నామని తెలిపిన ఎం. టీ. కృష్ణబాబు.. ప్రతి వార్డు సచివాలయంలో కూడా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ యాప్‌లను వాలంటీర్ల ద్వారా డౌన్లోడ్ చేయించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తద్వారా సమీపంలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు,ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు వంటి సమాచారం యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఆరోగ్య శ్రీకి సంబంధించి పూర్తి సమాచారంతో ముద్రించిన బ్రోచర్లను కూడా ఇంటింటికి పంపిణీ చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 12 వేలకు పైగా శిబిరాల్ని నిర్వహించామని, సరాసరి 450 ఓపీలు నమోదయ్యాయని కృష్ణ బాబు పేర్కొన్నారు. వీరందరికీ పరీక్షలు, మందులతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల్ని ఉచితంగా అందించామన్నారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ కూడా చేశారన్నారు. ఆరోగ్య శ్రీ పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించామన్నారు. పేద ప్రజలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చినా.. ప్రభుత్వం నుండి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. ఆరోగ్య శ్రీపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించేందుకు 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌ను చేపడతామన్నారు. ఆరోగ్య శ్రీ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసేందుకు ఎఎన్ ఎం/సిహెచ్వోలు, వాలంటీర్లతో కలిసి పనిచేస్తారని కృష్ణ బాబు తెలిపారు. గ్రామాల్లో అక్కడికక్కడే పూర్తి స్థాయి షుగర్ టెస్టులు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు కృష్ణబాబు తెలిపారు. తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చెయాలని కమీషనర్ నివాస్, ఆరోగ్య శ్రీ సీఈవో హరీంధరప్రసాద్లకు ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా ఆరోగ్య శ్రీ బ్రోచర్ ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు.ఆరోగ్యశ్రీ బ్రోచర్లోని సమాచారాన్ని చదివారా? అని రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. శిబిరానికొచ్చిన రోగులు , వృద్ధులు, గర్భిణులతో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ యాప్ ను ఎఎన్ఎంలు డౌన్లోడ్ చేయిస్తున్నారా అని ఆరా తీశారు. జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులు , ఫోల్డర్లు సరిపడా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకన్నారు. ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల -
తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల: తిరుమల తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఆహారం, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందుతున్నాయా లేదా..? అని గ్యాలరీల్లోని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కాసేపు ముచ్చటించారు. గ్యాలరీలో వేచి ఉండే ప్రతి భక్తుడికి గరుడ వాహనంపై ఉన్న మలప్ప స్వామి వారి దర్శనం చేయిస్తామని ఈ సందర్భంగా ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అన్నారు. గ్యాలరీల్లో లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నప్పటికీ వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 'నేను చాలామందితో మాట్లాడాను. అందరు కూడా టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు' అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాారు. ఇదీ చదవండి: ‘చంద్రయాన్–3’ ఓ అద్భుతం -
భోగాపురం ఎయిర్ పోర్ట్ నమూనాను పరిశీలించిన సీఎం జగన్
-
విజయవాడ: అంబేద్కర్ స్మృతివనం పనులను పరిశీలించిన మంత్రుల బృందం
-
ఉద్యాన పంటలను పరిశీలించిన మంత్రి జోగి రమేష్
సాక్షి, కృష్ణా జిల్లా: తుపాను ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. వ్యవసాయం దండగన్న టీడీపీ నేతలు, స్టీరింగ్ కమిటీ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రైతాంగ సంక్షేమానికి నాడు వైఎస్సార్, నేడు జగన్ ఎంతో కృషి చేశారన్నారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు -
అంగన్వాడీ సెంటర్లలో ‘విజిలెన్స్’ తనిఖీలు
తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలను విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజానగరం మండలంలో దివాన్ చెరువు, నెంబర్ 1, 42 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, టాయిలెట్లు లేకపోవడం, పరికరాలు అపరిశుభ్రంగా ఉండడం, హాజరులో తేడాలు గమనించారు. అమలాపురం మండలం కామనగరువు గ్రామంలోని బడుగువారి పేట, చిట్టెమ్మ చెరువు, అంగన్వాడీలను తనిఖీ చేసిన అధికారులు స్టాకు నిల్వల్లో ఉన్న వ్యత్యాసాలు గమనించి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, మధ్యాహ్నం అల్పాహారం ఇవ్వడం లేదని గుర్తించారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో జగ్గంపేట మండలం కాట్రావుల పల్లి గ్రామంలో 3, సీతానగరంలో 1, రంగాయమ్మ పేట అంగన్ వాడీ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. సీతానగరం అంగన్ వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉండడంతో దానిని ఖాళీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కాకినాడ డివిజన్ పరిధిలో తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో నంబర్ 3, 26, గురజానపల్లి గ్రామంలో 1, 2, 5 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. చొల్లంగిలో 26 నంబర్ అంగన్ వాడీ కేంద్రంలో పాలు లేకపోవడం గమనించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు చింతూరు డివిజన్లోని చింతూరు గొమ్మా 1, ఎర్రంపేట 1, 2, అంగన్ వాడీ కేంద్రాలు తనిఖీ చేశారు. కోడిగుడ్లు ఈ నెలలో అసలు సరఫరా లేకపోవడం, పాలు నిల్వల్లో తేడాలు రావడం, బాత్ రూమ్‌లు సరిగా నిర్వహించకపోవడం గమనించారు. రెడ్డి గంగాధరరావు మాట్లాడుతూ కొన్ని కేంద్రాలు అద్దె గృహాల్లో నిర్వహించడం, కొన్ని శిథిలావస్థలో ఉండడం, బాత్రూమ్లు లేకపోవడం, ఉన్నా సక్రమంగా నిర్వహించకపోవడం వంటి విషయాలను గమనించామని దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు బి.ఎస్.ఎన్.మూర్తి, వై.సత్యకిశోర్, బి.సాయి రమేష్, టి.రామ్మోహన్ రెడ్డి, పీడీ రత్న కుమార్, జి. గోపాలరావు, భార్గవమహేష్, షేక్‌వలీ, జి.అప్పారావు, సాయిబాబా, సుబ్రహ్మణ్యేశ్వరరావు, రామకృష్ణ, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
మోదీ రికార్డులను పరిశీలించనున్న'ఆప్'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బిఏ, ఎంఏ డిగ్రీలను బిజెపి ప్రెసిడెంట్ అమిత్ షా సోమవారం మీడియా ముందు బయట పెట్టినప్పటికీ.. ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాత్రం... అవి ఫోర్జరీ సర్టిఫికెట్లనీ, ఢిల్లీ యూనివర్శిటీకి వెళ్ళి తాము స్వయంగా రికార్డులు పరిశీలిస్తామని వెల్లడించారు. నరేంద్ర మోదీ పేరు.. రెండు డిగ్రీల్లో వేరు వేరుగా ఉందని ఆప్ ప్రతినిధి అసుతోష్ ఆరోపిస్తున్నారు. తన వద్ద ఉన్న మోదీ విద్యార్హతల కాపీలకు, షా చూపించిన వాటికి తేడా ఉందని, అందుకే అవి నకిలీవిగా తేలిపోయిందన్నారు. మోదీ పేరు బిఏ, ఎంఏ డిగ్రీల్లో వేరు వేరుగా ఉందన్నారు. బిఏ పార్ట్ 1 లో నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోదీ అని ఉండగా... రెండో సంవత్సరం మార్కు షీట్ లో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని ఉందన్నారు. అయితే మోదీ ఎంఏ తొలి ఏడాదిలో తన పేరును నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోదీగా పేర్కొన్నట్లు గుజరాత్ యూనివర్శిటీ తెలిపింది. రెండో సంవత్సరంలో పేరులోని కుమార్ ను తీసేసి నరేంద్ర దామోదర్ దాస్ మోదీగా మార్చుకున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆప్ నేతలు.. బిజెపి ప్రెసిడెంట్ అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో కలసి ఢిల్లీ యూనివర్శిటీలో మోదీ సర్టిఫికెట్ల రికార్డులను పరిశీలించేందుకు నిర్ణయించారు. కేజ్రీవాల్ వద్ద సీఐసీ ఆర్డర్ ఉన్నపుడు ఢిల్లీ యూనివర్శిటీ మోదీ డిగ్రీల అసలు పత్రాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని... వాటిని సీల్డ్ గా ఉంచి, ఎందుకు భయపడుతున్నారని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ధైర్యం ఉంటే మోదీ సర్టిఫికెట్లలో పేరు మార్చుకున్న విషయంపై అఫిడవిట్ ఇవ్వాలని ఆప్ నేత అశుతోష్ బిజెపికి ఛాలెంజ్ విసిరారు. -
రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు
న్యూఢిల్లీ: ప్రాజెక్టుల పురోగతి పరిశీలనకు డ్రోన్లు ఉపయోగించుకోవాలని రైల్వే నిర్ణయించింది. తొలిసారి డ్రోన్లతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీ)ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆ తర్వాత పనులు జరుగుతున్న ఇతర ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించనున్నారు. డీఎఫ్సీ కారిడార్‌లో మూడు రోజులు ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా పరిశీలించి దీని ద్వారా స్థాయీ నివేదిక త్వరగా తయారు చేయవచ్చని డీఎఫ్సీ ఎండీ ఆదేశ్ శర్మ తెలిపారు. -
తిరుపతిలో కేంద్ర రైల్వే మంత్రి తనిఖీ
-
తిరుపతిలో కేంద్ర రైల్వే మంత్రి తనిఖీ
తిరుపతి: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు అవసరమని సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. రైల్వే మంత్రి రాక సందర్భంగా పోలీసులు అతిగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి నెట్టేవేశారు.